రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే వ్యాపార సంస్థల్లో హైదరాబాద్ కు చెందినవే ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా మేఘా కృష్ణారెడ్డి అధికార పార్టీలకు నిధుల పంట పండిస్తున్నారు. ఆయనకు ఎంత ఆదాయం.. ఎలా వస్తుందో లెక్కలు బయటకు రావు కానీ.. వందల కోట్లు విరాళాలు మాత్రం ఇచ్చేస్తున్నారు. మేఘా ఇంజనీరింగ్ ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ 2023 ఆర్థిక సంవత్సరంలో ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్‌కు రూ. 87 కోట్లను విరాళంగా అందించింది. హైదరాబాద్‌కు చెందిన మరో కంపెనీ మేధా సర్వో డ్రైవ్స్ అదే సంవత్సరంలో రూ. 35 కోట్లు అందించి రెండో స్థానంలో నిలిచింది.
భారతదేశంలో అత్యంత ధనిక ట్రస్ట్ ప్రూడెంట్.. రాజకీయ నిధులుగా రూ. 363.16 కోట్లను పొందింది. అందులో రూ. 363.15 కోట్లు పంపిణీ చేసినట్లు భారత ఎన్నికల కమిషన్‌కు తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క రూపాయికి కూడా విరాళం ఇవ్వలేదు. మొత్తం విరాళం BJP, BRS, YSRCP, AAP మధ్య పంపిణీ చేశారు. నిధుల్లో అత్యధిక వాటాలు బీజేపీకి అందాయి. ప్రూడెంట్ ట్రస్ట్ అందుకున్న మొత్తం రాజకీయ నిధులలో, రూ. 75 కోట్లు బీఆర్ఎస్కి, రూ. 16 కోట్లు వైఎస్ఆర్సీపీకి, రూ. 90 లక్షలు ఆప్‌కి, మిగిలిన రూ. 276 కోట్లు బీజేపీకి విరాళంగా వచ్చాయి.
మేఘాతో పాటు మరికొన్ని కంపెనీలు ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొంది.. క్విడ్ ప్రో కో తరహాలో.. పార్ట ఫండ్ ఇస్తున్నాయన్న అనుమానాలు ఉన్నాయి అది కూడా వందల కోట్లలో ఫండ్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. మేఘా కంపెనీ… రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయస్థాయిలోనూ పెద్ద ఎత్తున కాంట్రాక్టులు చేపడుతోంది.