పోలవరం పనులను… రివర్స్ టెండరింగ్ పొందిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రారంభించింది. స్పిల్ వే వద్ద నీటిలోనే భూమిపూజ చేసి.. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ప్రతినిధులు.. షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేస్తామని తెలిపారు. రివర్స్ టెండర్లపై ప్రభుత్వం విధించిన స్టేను.. హైకోర్టు నిన్ననే వేకెట్ చేసింది. దీంతో.. రాత్రికి రాత్రే మేఘా కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తెల్లవారే సరికి… కొన్ని ప్రొక్లెయిన్లను.. పోలవరం ప్రాజెక్ట్ సైట్ వద్దకు తీసుకొచ్చి… వాటికి పూజలు చేసి.. పనులు ప్రారంభించినట్లుగా ప్రకటించారు. గత కాంట్రాక్ట్ ను రద్దు చేసినప్పుడు ప్రభుత్వం.. నవంబర్ ఒకటో తేదీ నుంచి పనులు ప్రారంభిస్తామని ప్రకటించింది.
దాని ప్రకారం.. ఈ రోజులు పనులు ప్రారంభిస్తున్నట్లుగా భూమిపూజ చేశారు. అయితే.. పోలవరం దగ్గర ఇప్పటికీ వరద ఉంది. అప్రోచ్ రోడ్లన్నీ నీటిలో మునిగి ఉన్నాయి. వరద తగ్గిన తర్వాత ఆ ఆప్రోచ్ రోడ్లు మళ్లీ ఉపయోగపడే పరిస్థితి లేదు. వాటిని మళ్లీ వేయాలి. భారీ యంత్రాలను తెప్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో.. చెప్పినట్లుగా పనులు ప్రారంభిస్తున్నట్లుగా భూమిపూజ చేశారు కానీ.. పనులు మాత్రం… ఇప్పటికిప్పుడు ప్రారంభమయ్యే అవకాశం లేదు. మరో వైపు.. పోలవరం పనుల ప్రారంభానికి … గత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం కూడా.. ఓ అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది.
భూమిపూజ కోసం మేఘా సంస్థ తీసుకొస్తున్న కొన్ని యంత్రాలను గతంలో పని చేసిన సబ్కాంట్రాక్టర్లు, కార్మికులు అడ్డుకున్నారు. తమ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సబ్కాంట్రాక్టర్లు, కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ రక్షణలో ప్రాజెక్టు వద్దకు యంత్ర సామాగ్రిని చేర్చారు. 2020కల్లా ప్రాజెక్టును పూర్తి చేస్తామని.. ముందుగా స్పిల్ వే పనులను ప్రారంభిస్తామని… మేఘా సిబ్బంది తెలిపారు.