పూరి జగన్నాథ్ మెహబూబా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి. చూడ్డానికి బాగానే ఉన్నా, ఆ తరవాత ఎందుకో అవకాశాలు రాలేదు. ఇప్పుడిప్పుడే.. నేహాని గుర్తిస్తోంది టాలీవుడ్. ఇటీవల… `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`లో ఓ కీలక పాత్ర చేసింది. ఇప్పుడు మరో ఛాన్స్ దక్కింది.
సందీప్ కిషన్ – జి.నాగేశ్వరరెడ్డి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా నేహాశెట్టి ఎంపికైంది. తన సినిమాలో హన్సికని కథానాయికగా ఎంచుకోవడం నాగేశ్వరెడ్డికి సెంటిమెంట్. ఈసారీ హన్సికనే హీరోయిన్ చేస్తారనుకున్నారు. కానీ.. నేహాని రంగంలోకి దించారు. అయితే.. ఏదో ఓ పాటలో అయినా హన్సిక కనిపించే ఛాన్సుందని తెలుస్తోంది. ఈనెలలోనే షూటింగ్ ప్రారంభిస్తారు. `తెనాలి రామకృష్ణ బిఏ, బీఎల్` తరవాత.. సందీప్, నాగేశ్వర రెడ్డి కాంబోలో వస్తున్న సినిమా ఇది. `తెనాలి..` ఫ్లాప్ అయినా, ఇద్దరూ ఒకరిపై మరొకరు నమ్మకం ఉంచారు. ఈసారి ఈ కాంబో ఏం చేస్తుందో చూడాలి..?!