చిరంజీవితో మెహర్‌రమేష్ సినిమా అనగానే ఎవరూ నమ్మలేదు. కానీ.. ఇప్పుడు ఆ సినిమా పట్టాలెక్కేసింది. అదే భోళా శంకర్. తమిళంలో విజయవంతమైన `వేదాళం` రిమేక్ ఇది. తమన్నా కథానాయిక. చిరు సోదరిగా కీర్తి సురేష్నటిస్తోంది. ఈ చిత్రం ఈరోజు ఉదయం హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మెహర్ రమేష్ ఏమన్నారంటే…
”ఇంత గ్యాప్ తీసుకున్న తరవాత.. ఓ మంచి కథతో రావాలన్న సంకల్పం.. చిరంజీవిగారు ఈ కథనచ్చి చేయడం నా లైఫ్ లోనే మధురమైన క్షణం. ఈసినిమా కోసం నా శక్తినంత ధారబోస్తా. తమన్నా చాలా బిజీగాఉంది. తన డేట్లు దొరకడంచాలాకష్టం. నేను కథచెప్పేటప్పుడే ‘మా సినిమాలో హీరోయిన్ తమన్నానే’ అని అందరికీ చెప్పా. కానీ తమన్నా దగ్గర డేట్లు లేవు. `డేట్లు లేకపోతే.. ఎవరి దగ్గర ఉంటే వాళ్ల దగ్గర నుంచి తీసుకొస్తా` అనిచెప్పా.చాలా నాటీ పాత్రతనది. `సైరా`లో చిరంజీవిగారితో చేసినా, వాళ్లిద్దరి మధ్య డాన్సులు లేవు. ఈసారి మంచి డాన్సింగ్ నెంబర్స్ సెట్ చేశాం. చిరంజీవి గారి సినిమాల్లో అవకాశం వచ్చిందన్న నిజాన్ని మహతి సాగర్ ఇంకా నమ్మలేకపోతున్నాడు. మణిశర్మ నుంచి వచ్చినతమన్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో, త్వరలో మహతి కూడా అదే స్థాయిలో ఉంటాడు. ‘కంత్రి’ సినిమాలో ‘1 2 3 నేనొక కంత్రి’ అనే పాటకు తానెంత వర్క్ చేశాడో నాకు తెలుసు. అందుకే తనని ఎంచుకున్నా. అన్నయ్యని అందరూ భోళా శంకరుడు అంటారు. ఈ టైటిల్ కి ఆయనే యాప్ట్. ఈ టైటిల్ పెట్టినప్పుడే ఈ సినిమా వైబ్రేషనే మారిపోయింది” అన్నారు.