‘కృష్ణ గాడి వీర ప్రేమా గాధ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైయింది మెహ్రీన్ పిర్జాదా. మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో లక్కీ చార్మ్ అనిపించుకుంది. ఎఫ్2తో హనీగా నవ్వించింది. కరోనా గ్యాప్ తర్వాత ఆమె నుంచి మరో సినిమా వస్తుంది. అదే ‘మంచి రోజులు వచ్చాయి’. సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా మారుతి తెరక్కించిన సినిమా ఇది. నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా మెహ్రీన్ చెప్పిన మంచి రోజు ముచ్చట్లు..
‘మంచి రోజులు వచ్చాయి’ లో కి ఎలా వచ్చారు ?
‘ఎఫ్3’ షూటింగ్ లో ఉండగా దర్శకుడు మారుతి కలిశారు. సినిమా, పాత్ర గురించి చెప్పారు. ఆయన సినిమా కాన్సెప్ట్స్ అన్నీ బావుంటాయి. మరో ఆలోచన లేకుండా సెట్స్‌లోకి వెళ్ళిపోయా. చాలా మంచి సబ్జెక్ట్ ఇది.
ఈ సినిమాలో మీ పాత్ర గురించి
పద్మ. సాఫ్ట్ వేర్ ఇంజనీర్. చాలా మెచ్యూర్ అమ్మాయి. చాలా కేరింగ్ ఫాదర్ ఉంటాడు. కూతురి గురించి చాలా ఆలోచిస్తాడు. ఆ ఆలోచనలు ఎటు దారితీసాయన్నది చాలా వినోదంగా చూపించారు.
ట్రైలర్ లో ఫాదర్ నే ఎక్కువగా చూపించారు ?
అవును.. హీరో, హీరోయిన్, ఫాదర్ మధ్య జరిగే స్టొరీ ఇది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు. అజయ్ గారు తండ్రి పాత్రలో చాలా కొత్తగా కనిపిస్తారు.
ఎఫ్2 హనీ పాత్రకి పద్మ పాత్రకి పోలిక ఉందా ?
లేదు. హానీ అల్లరి పిల్ల. పద్మ పాత్ర మాత్రం మెచ్యుర్ గా వుంటుంది.
కరోనా సమయంలో షూటింగ్ అంటే భయపడ్డారా ?
భయం వుంది. కానీ ఎవరో ఒకరు మొదలుపెట్టాలి. షూటింగ్ మొదలైన మొదటి రెండు రోజులు భయం వేసింది. కానీ నిర్మాతలు చాలా కేరింగ్ తీసుకున్నారు.
సంతోష్ శోభన్ తో నటించడం ఎలా అనిపిచింది ?
సంతోష్ చాలా కూల్. చాలా బాగా ఫెర్ఫామ్ చేశారు. చాలా మంచి నటుడు అవుతాడు.
సంతోష్ కి మీరు సీనియర్ కదా .. ఏమైనా సలహాలు ఇచ్చారా ?
లేదు, నాకు సినియర్ జూనియర్ అనే ఆలోచన వుండదు. నాతో పోల్చుంటే సంతోష్ కి ఎక్కువ అనుభవం వుంది. ఆతను నాలుగేళ్ళు థియేటర్స్ చేశాడు. అతడి నుంచే చాలా నేర్చుకున్నా.
పద్మ పాత్ర కోసం ఏమైనా ప్రిపేర్ అయ్యారా ?
లేదు. మారుతి గారు సెట్స్ లో వుంటే నటించడం చాలా ఈజీ
కామెడీ చేయడం కష్టమా ?
నాకు ఐతే లేదు. నేను పర్శనల్ గా చాలా ఫన్ . మారుతి గారు ఇంకా ఫన్. అంతా హిలేరియస్ గా వచ్చింది.
మీరు ఒక సినిమా సైన్ చేయడానికి ఏం చూస్తారు ?
ముందు పాత్ర ఎలా వుందో చూస్తాను .. అయితే ఈ సినిమాకి మాత్రం మారుతి గారు కాల్ చేసిన వెంటనే స్టొరీ కూడా వినికుండా ఓకే చెప్పా.
ఒక హీరోయిన్ గా స్టొరీ కూడా వినకుండా ఎలా సైన్ చేస్తారు ?
అన్నీ సినిమాలకు కాదు… మారుతి గారితో గతంలో పని చేశాను. ఆయనపై నాకు నమ్మకం వుంది. మన జర్నీలో కొందరిపై ఆ నమ్మకం ఏర్పడుతుంది. దర్శకుడు హను గారి పై కూడా ఆ నమ్మకం వుంది. ఆయన సినిమా అంటే కూడా స్టొరీ వినకుండానే ఓకే చెప్తా. నాకు మొదటి సినిమా ఇచ్చిన దర్శకుడు. ఆయన ఇచ్చిన అవకాశంతోనే ఇప్పుడు మీ ముందు వున్నాను. అలాంటి వారితో సినిమా అంటే ఇంకేం అలోచించను.
చాలా సన్నంగా కనిపిస్తున్నారు ?
యా.. చాలా బరువు తగ్గాను, ఫిట్ గా వుండటం ఇష్టం. సమయం దొరికింది. ఫిట్ గా మారా.
కరోనా బారిన పడ్డారు .. ఆ దశ ఎలా గడిచింది ?
చాలా భయంగా గడిచింది. దాదాపు రెండు నెలలు వీక్ నెస్ తో బాధపడ్డా. మొత్తానికి బయటపడ్డా.
కొత్త సినిమా కబుర్లు ?
కన్నడ లో ఓ సినిమా చేస్తున్న. తెలుగు లో ఎఫ్ 3. ఇంకొన్ని స్టోరీలు వింటున్నా. నిర్మాతలు ప్రకటిస్తారు.
అల్ ది బెస్ట్
థ్యాంక్ యూ.