కథానాయికల్లో అమ్మకూచీలు ఎక్కువమందే ఉంటారు. ఏదైనా సరే.. ముందు మమ్మీ చెవిలో ఊదేయాల్సిందే. అమ్మ ఆమోద ముద్ర పడకపోతే సినిమాలు కూడా చేయరు. అలాంటి వాళ్లలో మెహరీన్ కూడా చేరిపోయింది. ఎఫ్ 2 హిట్టుతో ఇప్పుడిప్పడే మెహరీన్ కెరీర్ గాడిలో పడుతోంది. తన కెరీర్‌ని స్పీడప్ చేసుకోవాల్సిన తరుణమిది. అయితే… ఇలాంటి పరిస్థితుల్లో `మమ్మీ` జోక్యం ఎక్కువైపోతోందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మెహరీన్ ఇటీవలే తన మేనేజర్ని తప్పించింది. తన డేట్లన్నీ ఇప్పుడు `అమ్మ` గారే చూసుకుంటున్నారు. కథలు విన్నాలన్నా, డేట్లు సర్దుబాటు చేయాలన్నా, పారితోషికం, సెట్లో ఇవ్వాల్సిన డైటు ఇవన్నీ మమ్మీనే డిసైడ్ చేస్తోందని సమాచారం. సెట్లో కూడా తరచూ కనిపిస్తోందని, మెహరీన్ మరీ అతిగా ఆధారపడిపోతుందని చెవులు కొరికేసుకుంటున్నారు. ప్రస్తుతం నాగశౌర్యతో ఓ సినిమా చేస్తోంది మెహరీన్. ఆ సినిమా కోసం ఏకంగా 80 లక్షల పారితోషికం అందుకుంటోంది. మెహరీన్‌కి ఇప్పటి వరకూ అందిన అత్యధిక పారితోషికం ఇదే. నిర్మాత దగ్గర గీచీ గీచి బేరమాడి 80 లక్షలు ఇప్పించుకోవడం వెనుక కూడా శ్రమే ఉందని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్.