పాపం మెహరీన్‌కి ఏమీ కలసి రావడం లేదు. కొత్త భామల విజృంభణతో అవకాశాలు తగ్గిపోయాయి. వచ్చిన సినిమాల్లో ఏదీ సరిగా ఆడడం లేదు కూడా. కేరాఫ్ సూర్య, పంతం, జవాన్.. ఇలా వరుసగా డిజాస్టర్లని మూటగట్టుకుంది. ఇప్పుడు తన ఆశలన్నీ ‘నోటా’పైనే. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. విజయ్ దేవరకొండ సినిమా కావడంతో.. ఓపెనింగ్స్ అదిరిపోయే ఛాన్సు కనిపిస్తోంది. అయితే ఈ సినిమా హిట్టయినా ఫట్టయినా అది మెహరీన్ కెరీర్‌కి ఎలాంటి ఎఫెక్ట్ చూపించదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో మెహరీన్ పాత్ర హీరోయిన్‌కి తక్కువ – సైడ్ క్యారెక్టర్‌కి ఎక్కువ అన్నట్టు ఉందట. ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ కాదని, కేవలం ఓ జర్నలిస్టు పాత్ర పోషిస్తోందని,
తనకీ – విజయ్ దేవరకొండకీ మధ్య ఎలాంటి రొమాన్స్ సాగదని టాక్. ఇది సీరియెస్‌గా సాగే పొలిటికల్ డ్రామా. కథ ఒక్కసారి పొలిటికల్ డ్రామాలోకి ప్రవేశించగానే.. పాలిటిక్స్ తప్ప ఏమీ కనిపించవు. మెహరీన్ కూడా సీరియస్‌గా జర్నలిస్టు పాత్ర చేసుకుంటూవెళ్లిపోతుందంతే. ఓ విధంగా చెప్పాలంటే నోటాలో నో రొమాన్స్, నో కామెడీ, నో హీరోయిన్.అందుకే… మెహరీన్ పాత్రకీ అంత `సీన్` లేకుండా పోయిందని టాక్. పాపం… చేతిలో ఉన్న ఈ ఒక్క సినిమా కూడా హీరోయిన్ స్టేటస్ ఇవ్వలేకపోయింది. ఏం చేస్తాం?? టైం బ్యాడ్ అంతే.