అల్లు అర్జున్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ చిత్రం ఇటీవలే పట్టాలెక్కింది. ఈ చిత్రానికి దువ్వాడ జగన్నాథమ్ అనే పేరు కూడా ఫిక్స్ చేశారు. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం అతి త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈలోగా కథానాయికల కోసం అన్వేషణ జరుగుతోంది. బన్నీ పక్కన హీరోయిన్ గా కాజల్‌ని ఎంచుకొన్నారన్న గుసగుసలు వినిపించాయి. మొన్నామధ్య చిరంజీవి సెట్లో కాజల్‌తో చిత్రబృందం మంతనాలాడి వచ్చింది. అయితే ఏమైందో ఏమో…కాజల్‌ని పక్కన పెట్టేశారిప్పుడు. బన్నీ పక్కన కొత్త హీరోయిన్ కోసం వెదుకుతున్నారు. ‘బన్నీతో ఇది వరకు నటించిన కథానాయిక వద్దు. కాంబినేషన్ ఫ్రెష్ గా ఉండాల’న్నది… చిత్రబృందం ఐడియా. అందుకోసం కొత్తమ్మాయిలే బెటర్ ఆప్షన్. అందుకే ఇప్పుడు మెహరీన్ పేరు లైన్లోకి వచ్చింది.
కృష్ణగాడి వీర ప్రేమగాథతో వెలుగులోకి వచ్చింది మెహరీన్. ఆ సినిమా హిట్టవ్వడంతో రెండు సినిమాల్లో ఆఫర్లు అందుకొంది. అల్లు శిరీష్ పక్కన ఓ సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు బన్నీకీ తననే సెట్ చేసే అవకాశాలున్నాయి. స్టార్ హీరోయిన్ అయితే బడ్జెట్ లెక్కల్లో తేడా వస్తోందన్నది దిల్‌రాజు భయం. కథానాయికకు కోటి రూపాయలు కేటాయించాలంటే ఆయన కాస్త ఆలోచిస్తున్నారు. అందుకే.. కొత్తమ్మాయి వైపు మొగ్గుచూపుతున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సో.. మెహరీన్ ఎంపిక దాదాపుగా ఖాయమైనట్టే. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి.