‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది మెహరీన్ కౌర్. ఈ సినిమాలో ఆమెకు మంచిమార్కులే పడ్డాయి. నేచురల్ గా నటించిదన్న ప్రసంశలు దక్కాయి. అటు గ్లామర్ పాత్రలకు కూడా సరిపొతుందన్న ఇంప్రెషన్ కలిగించింది మెహరీన్. అయితే ఈ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి. ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’తర్వాత ఆమె నుండి మరో సినిమా రాలేదు.2016 మొత్తానికి ఒక్క సినిమాతోనే సరిపెట్టుకుంది మెహరీన్.
అయితే 2017 ఆమెకు కీలకం కానుంది. ఇప్పటికే నాలుగు సినిమాలకి సైన్ చేసింది మెహరీన్. రవితేజ హీరోగా తెరకెక్కనున్న’రాజా ది గ్రేట్’లో మెహరీన్ హీరోయిన్గా ఎంపిక చేశారు. సాయిధరమ్ తేజ సరసన’జవాన్’ సినిమాలో ఈమెనే హీరోయిన్. అలాగే ఎన్టీఆర్-బాబీ సినిమాకి కూడా ఒక హీరోయిన్ గా ఆమె పేరు పరిశీలనలో వుంది. దీంతో పాటు ఓ బాలీవుడ్ సినిమా కూడా ఆమె ఖాతాలో వుంది. అనుష్క శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫిల్లౌరీ’.ఇందులో సెకెండ్ హీరోయిన్ రోల్ ప్లే చేస్తోంది మెహరీన్. దీంతో పాటు మరికొన్ని చిత్రాలు కూడా చర్చల్లో వున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత వుంది. రకుల్ ప్రీత్ లేదా కీర్తి సురేష్ అన్నట్టుగా వుంది పరిస్థితి. ఇప్పుడు మెహరీన్ చేతిలో ఫుల్లుగా సినిమాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా క్రేజీ సినిమాలే. ఈ సినిమాల్లో అదరగొడితే కనుక టాలీవుడ్ భామల టాప్ లీగ్ లో చేరే అవకాశాలు పుష్కలంగా వున్నాయి మెహరీన్ కి. మరి ఈ అవకాశాలను మెహరీన్ ఎంత వరకు ఉపయోగించుకుటుందో చూడాలి.