నెల్లూరులో వైసీపీకి మిగిలిన ఒకే ఒక్క కుటుంబం మేకపాటిది. ఆ కుటుంబం కూడా జగన్ రెడ్డిని నమ్ముకుని సర్వం కోల్పోయినట్లుగా అయ్యారు. సీనియర్ మేకపాటిని పదేళ్ల కిందటే వయసు అయిపోయిందని పక్కన పెట్టేశారు. ఆయన కుమారుడికి మంత్రి పదవి ఇస్తే .. అదే ఆయన పాలిట శాపంగా మారింది. ఆయన చనిపోవడంతో మరో కుమారుడ్ని రాజకీయాల్లోకి తెచ్చారు. సోదరుడికి ఆస్తులు పంచకుండా మోసం చేయడంతో ఆయన కూడా దూరమయ్యారు. మొత్తంగా ఇప్పుడు మేకపాటి ఫ్యామిలీ చీలిపోయింది. .. వారి రాజకీయ కోటలు కూడా కుప్పకూలాయి.
ఇప్పుడు జగన్ రెడ్డి కూడా వీరిని పట్టించుకోవడం లేదు. నెల్లూరు రాజకీయాలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వీరికి సమాచారం రావడం లేదని చెబుతున్నారు. మేకపాటికి వయసు అయిపోగా.. ఆయన కుమారుడు, సోదరుడు వ్యాపారాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఈ కారణంగా జగన్ కూడా ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలకు ప్రత్యామ్నాయ లీడర్లను ఎంచుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
మేకపాటి వైసీపీని నమ్ముకుని తీవ్రంగా నష్టపోయారు. ఆయన వరుసగా ఎంపీగా గెలుస్తున్నా… కీలక సమయం పక్కన పెట్టేశారు. అప్పట్నుంచి వారికి గడ్డు పరిస్థితి ఎదురైంది. చెట్టంత ఎదిగిన కుమారుడ్ని కోల్పయిన మేకపాటి.. మెల్లగా రాజకీయంగా సాధించినదంతా నష్టపోయారు. ఇప్పుడు ఆయన దగ్గర ఓపిక లేదని జగన్ రెడ్డి కూడా పక్కన పెట్టేస్తున్నారు.