తన ఎన్నికల హామీని నిలబెట్టుకునే దిశగా తెదేపా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. గత ఎన్నికల్లో తాము గద్దెనెక్కడానికి కీలకం గా మారిన కాపుల్ని నిరాశ పరిచకుండా వారిని బీసీలుగా చేర్చేందుకు సిద్ధమైంది.
ఈ మేరకు శుక్రవారం స్పష్టమైన సంకేతాలు తెదేపా వైపు నుంచి వెలువడ్డాయి. కాపుల్ని బీసీల్లో చేరుస్తామన్న హామీని నిలబెట్టుకోవాలంటూ ముద్రగడ ఉద్యమాన్ని మొదలు పెట్టిన అనంతరం ప్రభుత్వం మంజునాథ కమిషన్ వేసింది తాజాగా తెలుస్తున్న ప్రకారం ఆ కమిషన్ నివేదిక సిద్ధమైంది. అసెంబ్లీ ముందుకీ రానుంది.దీనిని అసెంబ్లీ ఆమోదించనుంది. ఇప్పటికే ఈ విషయం చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులకు సూచనప్రాయంగా తెలిపారు.
ఈ నేపథ్యంలో కాపులకు ఇచ్చిన హామీ ని సీఎం చంద్రబాబు నెరవేరుస్తున్నారని ఎం పీ అవంతె శ్రీనివాస్ స్పష్టం చేశారు. గుజ్జర్ల మాదిరిగా వెనక్కు తీసుకోవాల్సిన అవసరం రాకుండా కమిషన్ వేసామన్నారు. ఇతర కులాలకు ఇబ్బంది లేకుండా కాపుల్ని బీ సీ ల్లో చేర్చనున్నామన్నారు.
వచ్చే ఏడాది ని ఎన్నికల సంవత్సరం గా అంచనాలున్న తరుణంలో… తెదేపా తన హామీ ని గాని నిలబెట్టుకుంటే. . కాపుల్లో ఆ పార్టీ పట్ల మొగ్గు కనపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.