‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో దర్శకుడుగా పరిచమయైన మేర్లపాక గాంధీ లేటెస్ట్గా శర్వానంద్‌తో చేసిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ కామెడీ ఎక్స్‌ప్రెస్‌గా అందర్నీ ఎంటర్టైన్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లో భాగంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ సినిమా కూడా యు.వి. క్రియేషన్స్ బేనర్లోనే వుంటుందని చెప్పాడు గాంధీ. అతను చెప్పినట్టుగానే అదే బేనర్లో అతని సినిమా కన్ఫర్మ్ అయింది. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నటించే హీరో, హీరోయిన్లు ఎవరు, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే విషయాలు త్వరలోనే ఎనౌన్స్ చేస్తారట. తన మొదటి రెండు సినిమాలకు ‘ఎక్స్‌ప్రెస్’ టైటిల్స్ పెట్టిన గాంధీ మూడో సినిమాకి ఎలాంటి టైటిల్ పెడతాడా అని అంతా ఎదురుచూస్తున్నారు. అటానే తన రెండు సినిమాల్లోనూ సురభికే హీరోయిన్గా అవకాశం ఇచ్చిన గాంధీ మూడో సినిమాకైనా మరో హీరోయిన్ కోసం ట్రై చేస్తాడో లేక సురభినే కంటిన్యూ చేస్తాడో చూడాలి.