విశాఖ, విజయవాడ మెట్రోలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రెడీ చేసిన డీపీఆర్‌లకు ఆమోదం తెలిపింది. గతంలోనే ఈ రెండు ప్రాజెక్టులు కేంద్రం నిధులతో నిర్మించాలని ప్రతిపాదించింది. రాజధాని కోటాలో విజయవాడ.. మెట్రో పాలనీలో భాగంగా విశాఖలో నిర్మాణం చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు.
విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టులో మొదటిదశలో 46.23 కిలోమీటర్ల మేర మూడు కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకూ 34.4 కిలోమీటర్ల మేర ఒకటో కారిడార్ గా డీపీఆర్ లో పేర్కొన్నారు. గురుద్వారా నుంచి పాతపోస్ట్ ఆఫీసు వరకూ రెండో కారిడార్ ను 5.08 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. మూడో కారిడార్ గా తాడిచెట్ల పాలెం నుంచి చినవాల్తేర్ వరకూ 6.75 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. మొదటి దశలో మొత్తం 11,498 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు.
రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకూ 30.67 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణం ఉంటుంది.
విజయవాడ మెట్రో రైల్ డీపీఆఆర్లో రెండు దశల్లో మొత్తంగా 38.4కి.మీ మేర నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన డీపీఆర్‌ను మెట్రో రైల్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించగా.. ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిది. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టును మొత్తంగా రూ.11,009 కోట్ల మేర కారిడార్ 1ఎ, బి నిర్మించాలని ప్లాన్ రెడీ చేసుకుంటే భూసేకరణ కోసం రూ.1152 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించేలా డీపీఆర్‌ను సిద్ధం చేసింది. విజయవాడ మెట్రోలో రెండో దశలో భాగంగా మూడో కారిడార్‌ను దాదాపు 27.75కి.మీల మేర నిర్మించాలని ప్లాన్ చేశారు. 1ఎ కారిడార్‌లో భాగంగా గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు 1బిలో భాగంగా గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు ఉంటుంది.
రెండు సిటీల మెట్రోలకు ప్లాన్లు అయితే అద్భుతంగా ఉన్నాయి కానీ నిధుల వెసులబాటే కీలకంగా మారనుంది. కేంద్రం అనుకుంటే.. వెంటనే పనులు ప్రారంభించే అవకాశం ఉంటుంది.