బిజెపి అధిష్టానం కేరళ ఎన్నికల విషయంలో అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇటీవలే తమ పార్టీలో చేరిన 88 సంవత్సరాల వయసున్న శ్రీధరన్ ని ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ బీజేపీ కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..
స్వతహాగా ఇంజనీర్ అయిన శ్రీధరన్ భారతదేశానికి మెట్రో మాన్ గా పిలువబడతాడు. ఢిల్లీ మెట్రో, కొంకణ్ రైల్వే నిర్మించడంలో అసమానమైన ప్రతిభ తోపాటు నాయకత్వ లక్షణాలు ప్రదర్శించిన ఆయన పద్మ విభూషణ్ అవార్డు కూడా స్వీకరించారు. కొంతకాలం పాటు ఐక్యరాజ్యసమితిలో కూడా పనిచేశారు. మెట్రో సాకారం చేయడంలో ఆయన చూపిన సృజనాత్మకత ని మేనేజ్మెంట్ పాఠశాలల లో ప్రశంసిస్తూ ఉంటారు. ఇటీవలే ఆయన బిజెపి పార్టీలో చేరారు. ఏ స్థానం నుండి అసెంబ్లీకి పోటీ చేయాలనే స్పష్టత లేకపోయినప్పటికీ కచ్చితంగా అసెంబ్లీకి పోటీ చేస్తాను అని ఆయన తెలియజేశారు. అయితే ఇంతలోనే శ్రీధరన్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా బిజెపి ప్రకటించడం రాజకీయ విశ్లేషకులకి సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది.
ప్రస్తుతం ఉన్న సర్వే ఫలితాల ప్రకారం చూస్తే బిజెపికి గెలుపు అవకాశాలు పెద్దగా లేవు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్ ని నించో పెట్టడం బిజెపికి ఏమాత్రం లాభం చేకూరుస్తుంది అన్నది వేచి చూడాలి.