కేటీఆర్ పట్టుదలకు ప్రతిఫలం..మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ !

హైదరాబాద్‌ను డేటా సెంటర్‌గా మార్చేందుకు కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. గచ్చిబౌలిలోని మైక్రోసాఫ్ట్ క్యాంపస్‌లో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో మైక్రోసాప్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి ప్రకటించారు. రూ. పదిహేను వేల కోట్ల పెట్టుబడి మైక్రోసాఫ్ట్ పెట్టనుంది.

మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాలను కూడా పరిశీలించింది. కానీ కేటీఆర్ పట్టుబట్టి హైదరాబాద్‌లో డేటా కేంద్రం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేశారు. మైక్రోసాఫ్ట్ యాజమాన్యాన్ని అంగీకరింప చేశారు. మైక్రోసాఫ్ట్‌లో నిర్ణయాలు అంతతేలికగా జరగవు. పక్కాగా పూర్తయిన తర్వాతే అంగీకరిస్తారు. భూమి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణ సర్కార్ భూమిని మైక్రోసాఫ్ట్ కంపెనీకి చూపించింది. ఆ భూమి.. ప్రభుత్వం కల్పిస్తామని హామీ ఇచ్చిన సౌకర్యాల పట్ల మైక్రోసాఫ్ట్ సంతృప్తి చెందింది. ఆ తర్వాతే ఒప్పందం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాలు పోటీ పడినా కేటీఆర్ చొరవతో హైదరాబాద్‌కే దక్కింది.

హైటెక్ సిటీలో మైక్రోసాఫ్ట్ డెలవప్‌మెంట్ సెంటర్ పెట్టిన తర్వాత… ఎలా అయితే.. సాఫ్ట్‌వేర్ సిటీగా మారిందో.. ఇప్పుడు.. ఏదే తరహాలో.. మైక్రోసాఫ్ట్.. డేటా సెంటర్ గా హైదరాబాద్ మరే అవకాశం ఉంది. తెలంగాణలో డేటా సెంటర్ పెట్టాలని ఇప్పటికే అదానీ గ్రూప్ నిర్ణయించింది. హైదరాబాద్‌లో 13 బిలియన్ డాలర్ల వ్యయంతో డేటా సెంటర్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది.డేటా రంగంలో ఉన్న మరికొన్ని ప్రధానమైన కంపెనీలచూపు కూడా హైదరాబాద్ వైపు ఉన్నట్లుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు – జగన్ హయాంలో అపచారం!

తిరుమలలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారని తేలిపోయింది. చివరికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ క్వాలిటీ అత్యంత ఘోరంగా ఉండేది. దానికి కారణం...

తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి

తమిళ రాజకీయాలు మారిపోతున్నాయి. ఓ వైపు పొలిటికల్ వాక్యూమ్ ను ఉపయోగించుకుని రాజకీయ నాయకుడు అయిపోవడానికి విజయ్ కొత్త పార్టీ పెట్టారు. మరో వైపు అన్నాడీఎంకే కూడా బలమైన క్యాడర్ తో ఉంది....

వైసీపీ ఆఫీసులకూ అదే పరిస్థితి – లా ఒక్కటే !

నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో .. వైసీపీకి కూడా గుండెల్లో రాయి పడింది. బీఆర్ఎస్ పార్టీకి అదొక్కదానికే అనుమతుల్లేవేమో కానీ వైసీపీకి చెందిన ఒక్క ఆఫీసుకు తప్ప...

దేవరని రామాయణంతో ముడిపెట్టిన పరుచూరి

రచయిత పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' పేరుతో సినిమాల‌ను విశ్లేషిస్తుంటారు. ఆయన విశ్లేషణలు చాలా ప్రజాదరణ పొందాయి. తన అనుభవాలన్నీ జోడిస్తూ సినిమాల్లోని లోటుపాట్లని, మంచి విషయాల్ని చెపుతుంటారు. తాజాగా ఎన్టీఆర్ దేవర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close