హైదరాబాద్‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తుది చర్చలు పూర్తి చేసింది. గత ఆగస్టులోనే కేటీఆర్ ఈ అంశంపై ఓ ట్వీట్ చేశారు. కానీ వివిధ కారణాలతో ఆలస్యం అయింది. ఇప్పుడు అన్ని చర్చలు పూర్తయినట్లుగా తెలుస్తోంది. శంషాబాద్ ప్రాంతంలో 50 ఎకరాలను మైక్రోసాఫ్ట్‌కు ప్రభుత్వం చూపించింది. ఆ స్థలం వారికి నచ్చింది. అక్కడ రూ.15 వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ నిర్ణయించుకుంది. ఫిబ్రవరిలో అధికారికంగా సంయుక్త ప్రకటన చేయనున్నారు.
డేటా సెంటర్ సామర్ధ్యం, విస్తీర్ణం తదితర పూర్తి వివరాలను మైక్రోసాఫ్ట్ ప్రకటించాల్సి ఉంది. మైక్రోసాఫ్ట్‌ను ప్రస్తుతం హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సత్యనాదెళ్ల నడిపిస్తున్నారు. అదే సమయంలో మైక్రోసాఫ్ట్‌కు హైదరాబాద్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. డేటా సెంటర్లకు హైదరాబాద్ వాతావరణం కూడా ఎంతో అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా డేటా కంపెనీలు హైదరాబాద్‌పై ఆసక్తి చూపిస్తున్నాయి.
అదానీ కూడా దాదాపుగా రూ. లక్ష కోట్లతే డేటా సెంటర్ పెట్టాలనే ప్రణాళికలు ప్రకటించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. హైదరాబాద్ డేటా సెంటర్ల కేంద్రంగా మారే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కూడా ప్రత్యేక పాలసీని ప్రకటించింది. ఇది హైదరాబాద్‌కు మరింత ప్లస్ అయింది. మైక్రోసాఫ్ట్ పెట్టుబడి ప్రకటన తర్వాత హైదరాబాద్ ఐటీ రంగానికి మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది.