హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో రేంజ్ తాజా ట్యాబ్లెట్ కంప్యూటర్లు ఇవాళ ఇండియాలో విడుదలయ్యాయి. సర్ఫేస్ ప్రో 3 మోడల్స్ ధరలు రు.73,990 నుంచి ప్రారంభమవుతుండగా, సర్ఫేస్ ప్రో 4 మోడల్స్ ధరలు రు.89,990 నుంచి ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతం మొదటి ఆరునెలలూ ఈ రెండు మోడల్స్‌నూ ఒక్క అమెజాన్ పోర్టల్‌లో మాత్రమే అమ్ముతున్నామని మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు తెలిపారు. కస్టమర్లు ఇవాళ్టినుంచి బుక్ చేసుకోవచ్చని, డెలివరీ ఈ నెల 14 నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. మైక్రోసాఫ్ట్ ప్రో 4 డిస్ప్లే 12.3 అంగుళాలు ఉండగా, ప్రో 3 డిస్ప్లే 12 అంగుళాలు ఉంది. ఒక్క మోడల్‌కు తప్పితే అన్నింటికీ స్టైలస్ ఇస్తున్నారు. స్మార్ట్ కీబోర్డ్ కావాలంటే అదనంగా రు.12,490 పెట్టుకోవాలి. దీనితో ఈ ట్యాబ్లెట్లు పూర్తిస్థాయి ల్యాప్టాప్లుగా మారిపోతాయి. ప్రో 4లో హై ఎండ్ మోడల్ ధర రు.1,44,990గా ఉంది. సర్ఫేస్ ప్రో మోడల్స్ ద్వారా ఏపిల్ కంపెనీ వారి ఐప్యాడ్ ప్రో మోడల్స్‌పై మైక్రోసాఫ్ట్ పైచేయి సాధించాలని ప్రయత్నిస్తోంది.