పవన్ కల్యాణ్‌నూ అరెస్ట్ చేస్తారన్నంత హడావుడి చేశారు. విశాఖ నోవాటెల్ హోటల్ని వందల మంది పోలీసులు చుట్టు ముట్టారు. జనసేన నాయకుల్ని అరెస్టు చేశారు. ఎందుకంటే.. విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి జరిగిందని కేసులు నమోదు చేసి.. విశాఖ జనసేన కీలక నేతలందర్నీ అరెస్ట్ చేసేశారు. చివరికి పవన్ కల్యాణ్‌ను కూడా అరెస్ట్ చేస్తారన్నంతగా హడావుడి చేశారు. ఇదంతా జనసైనికుల్ని రెచ్చగొట్టేలా సాగింది. అసలు రోజాపై.. జోగి రమేష్‌పైన ఎవరు దాడి చేశారో స్పష్టంగా తెలియదు. దానికి విశాఖ జనసేన కీలక నేతల్ని బాధ్యుల్ని చేస్తే.. వైసీపీ కార్యకర్తలు చేస్తున్న ప్రతీ అరాచకానికి ఎవర్ని బాధ్యుల్ని చేయాల ి?
విశాఖలో పవన్ కల్యాణ్ ఎంట్రీనే ఓ రేంజ్లో సాగింది. విశాఖ గర్జనకు స్కూ పిల్లల్ని తరలించుకు వస్తేనే ఓ పది వేల మంది కూడా కనిపించలేదు. కానీ.. పవన్ కల్యాణ్‌కు స్వాగతం చెప్పడానికి ఎవరూ తరలించుకురాకపోయినా వేలాది అభిమానులు వచ్చారు ఎయిర్ పోర్టు నుంచి నోవాటెల్ వరకూ జనమే జనం. ఇంత స్పందన… గర్జనకు వచ్చి ఉంటే వైసీపీ నేతలు చేసే హడావుడి ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ వాళ్లది ఫెయిల్… పవన్ కు స్వాగతానికే ఆ రేంజ్ చూపించే సరికి.. వైసీపీ నేతలకు అసూయ పుట్టినట్లుగా ఉంది.
ఇక ఉత్తరాంధ్రలో పవన్ కార్యక్రమాలను భగ్నం చేయడమే లక్ష్యంగా అరెస్టులు చేసుకుంటూ పోయారు. రెండు రోజుల పాటు పవన్ కార్యక్రమాలను విఫలం చేసేందుకే ఈ తప్పుడు కేసులతో అరెస్టులు చేశారని తెలుసుకోవడానికి పెద్ద పొలిటికల్ నాలెడ్జ్ అవసరం లేదు. అయితే ఇలాంటి తీరు వల్ల జనసైనికుల్లో మరింత అసహనం గూడుకట్టుకునేలా చేయడమే. అధికార పార్టీ నేతలుగా.. పోలీసుల భద్రత ఉండి… ఆ సిట్యూయేషన్‌ను ఫేస్ చేయాల్సి వచ్చింది. అదే అధికారం పోయిన తర్వాత వారికి ఎదురైతే.. వారి ఆవేశాన్ని కంట్రోల్ చేయడం సాధ్యమా ?. అలాంటి అసహనాన్ని వైసీపీ నేతలు సృష్టిస్తున్నారు.