తెలుగు సాహిత్యంలోని అత్యుత్తమ కథల్ని ఎంపిక చేస్తే.. అందులో `మిథునం` తప్పనిసరిగా ఉంటుంది. శ్రీరమణ నుంచి జాలువారిన అద్భుతమైన కథ మిథునం. ఈ కథని వివిధ భాషల్లో సినిమాలుగా తీశారు. తనికెళ్ల భరణి దర్శకత్వంలో వచ్చిన `మిథునం` విమర్శకుల్ని మెప్పించింది. బాలు, శ్రీలక్ష్మిల అభినయం ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ కథ బాలీవుడ్ కి వెళ్లబోతోందని సమాచారం.
ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ మిథునం కథ హక్కుల్ని కొనుగోలు చేసింది. ఈ కథలో అమితాబ్ బచ్చన్, రేఖలు నటిస్తారని ప్రచారం మొదలైంది. కేవలం రెండు పాత్రల మధ్య నడిచే కథ ఇది. సుదీర్ఘ విరామం తరవాత.. మళ్లీ ఈ జంటని తెరపై చూడడం నిజంగా సినీ అభిమానులకు కనుల పండగే. మరి.. ఈ చిత్రానికి దర్శకత్వం ఎవరు వహిస్తారు? ఎప్పుడు మొదలవుతుంది? అనే విషయాల్ని తెలుసుకోవాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.