లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన చీకటి రాజ్యం సినిమా రిలీజ్ అవుతుండగా మరో సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు కమల్. సీనియర్ డైరక్టర్ మౌలి రాసిన కథ ఆధారంగా తెరకెక్కించబడుతున్న ఈ సినిమాను కూడా చీకటి రాజ్యం దర్శకుడు, తన శిష్యుడు రాజేష్ ఎం.సెల్వనే డైరెక్ట్ చేయడం విశేషం. అయితే ఈ సినిమాలో కమల్ తో జతకట్టే ఛాన్స్ ఈసారి మిల్క్ బ్యూటీ తమన్నా దక్కించుకుంది.
స్టార్ హీరోలందరితో రొమాన్స్ చేసిన తమన్నా కమల్ హాసన్ తో ఇంతవరకు ఏ చిత్రంలో నటించే ఛాన్స్ రాలేదు. అయితే ఈ సినిమాకు ఆ అవకాశం వచ్చింది. తన మార్క్ సొగసైన అందాలతో అలరించే తమన్నా కమల్ పక్కన ఎలా ఉంటుందో చూడాలి. దాదాపు తన కూతురు వయసున్న మిల్క్ బ్యూటీతో కమల్ జతకట్టడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది.
కమల్ ని ఒక సినిమా డైరెక్ట్ చేస్తేనే చాలు అనుకునే ఈరోజుల్లో వరుసెంట రెండో సినిమా చేయడం గొప్ప విషయమే అని చెప్పొచ్చు. రాజేష్ ఎం.సెల్వ వర్కింగ్ స్టైల్ కి ఫిదా అయిన కమల్ తన తర్వాత సినిమాను కూడా తనతోనే చేస్తున్నాడు. మరి క్రేజీ కాంబినేషన్ గా వస్తున్న ఈ సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో రిలీజ్ అయితే గాని చెప్పలేం.