బీహార్ రాష్ట్రంలో మొట్ట మొదటిసారి అడుగుపెడుతున్న మజ్లీస్ పార్టీ ఊహించిన దానికంటే చాలా తొందరగానే అక్కడ అల్లుకుపోయిందని చెప్పవచ్చును. అందుకు అది ఎంచుకొన్న మార్గం మాత్రం చాలా అక్షేపనీయమయినది. ముస్లిములు అధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో మాత్రమే మజ్లీస్ పార్టీ పోటీ చేస్తోంది. కనుక అక్కడ చాలా తేలికగానే పాగా వేయగలిగింది. మొదట ముస్లింల సమస్యల గురించి మాట్లాడి అందరినీ ఆకట్టుకొన్న ఆ పార్టీ నేతలు తరువాత మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడంతో తక్షణమే దాని ఫలితాలు కనబడ్డాయి. స్థానికంగా రెండు కాళీ మందిరాలలో విగ్రహాలు ద్వంసం చేయబడ్డాయి. దానితో అల్లర్లు చెలరేగాయి. ప్రజలలో మత విద్వేషాలను రెచ్చగొట్టినందుకు పోలీసులు అక్బరుద్దీన్ ఓవైసీపై కేసులు నమోదు చేసారు. అల్లర్లకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకొన్నారు.
బహుశః మజ్లీస్ పార్టీ కూడా ఇలాగే జరగాలని ఆశిస్తోందేమో? ఊహించని ఈ పరిణామాలతో మజ్లీస్ పార్టీ బీహార్ లో అడుగుపెట్టిన రెండు వారాలకే స్థానిక ముస్లిం ప్రజలకు చేరువకాగలిగింది. వారికి తమ పార్టీయే పూర్తి న్యాయం చేయగలదనే నమ్మకం కలిగించగలిగింది. కనుక ముస్లిం ప్రజల ఓట్లు ఈసారి గంపగుత్తగా మజ్లీస్ పార్టీకే పడినా ఆశ్చర్యం లేదు. అయితే హైదరాబాద్ లో ముస్లిం ప్రజల సమస్యలపై పోరాడి వారి సంక్షేమం కోసం పనిచేస్తానని చెప్పిన ఆ పార్టీ ఇన్నేళ్ళలో అక్కడ ఏమి ఒరగబెట్టింది? అని ప్రశ్నించుకొంటే ఏమీ లేదనే సమాదానం వస్తుంది. నేటికీ హైదరాబాద్ పాతబస్తీలో వేలాది మంది ముస్లింలు కటిక దారిద్ర్యం అనుభవిస్తున్నారు. ఆ దారిద్ర్యం భరించలేక తమ ఆడపిల్లలను ముసలి అరబ్బులకు ఇచ్చి కాంట్రాక్టు పెళ్ళిళ్ళు జరిపిన సంఘటనలు అనేకం బయటపడ్డాయి. అలాగే దేశంలో ఎక్కడ బాంబులు పేలినా అందరూ మొదట హైదరాబాద్ వంకే చూస్తుంటారు. అందుకు కారణం హైదరాబాద్ కి చెందిన యువకులు ఐసిస్ తదితర ఉగ్రవాద సంస్థల వైపు ఆకర్షితులవుతున్నారు. పేదరికం, అవిద్య, నిరుద్యోగం, అనారోగ్యం వంటి సకల దరిద్రాలతో హైదరాబాద్ లో ముస్లిం ప్రజలు అనేక మంది కునారిల్లుతున్నారు.
అనేక దశాబ్దాలుగా వారి ఓట్లతో గెలుస్తున్న మజ్లీస్ పార్టీ బెతలు వారి సమస్యల పరిష్కారానికి పెద్దగా చేసింది ఏమీ లేదు. ఉంటే నేడు హైదరాబాద్ లో ముస్లిం ప్రజలు ఇన్ని సమస్యలలో కొట్టుమిట్టాడే వారేకాదు. ఉట్టికి ఎగురలేనమ్మ స్వరగానికి ఎగురానన్నట్లు హైదరాబాద్ లో ముస్లిం ప్రజలకు మజ్లీస్ పార్టీ ఏమీ చేయలేకపోయినా బీహార్ లో ముస్లిం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందిట. ఇప్పుడు ఇతర పార్టీలన్నిటినీ తిట్టినా తిట్టు తిట్టకుండా తీతిపొస్థున్న మజ్లీస్ నేతలు ఎన్నికల తరువాత మళ్ళీ అదే పార్టీలతో చేతులు కలిపి అధికారం పంచుకోవచ్చును. తద్వారా రాష్ట్రంలో మరింత బలపడవచ్చును కానీ స్థానిక ముస్లిం ప్రజలకు ఏమయినా మేలు చేస్తారో లేదో ఖచ్చితంగా చెప్పలేము.