మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ… తన విస్తృతిని పెంచుకుంటూ.. బీజేపీని గెలిపించుకుంటూ పోతున్నారు. ముస్లింల ఓట్లు చీలిపోయి.. బీజేపీకి లాభం కలుగుతుందని… తెలిసినా.. ఆయన బీహార్, యూపీ, మహారాష్ట్ర ఎన్నికలలో పోటీ చేశారు. మహారాష్ట్రలో.. బీజేపీ – శివసేన కూటమికి బొటాబొటి మెజార్టీ వచ్చిందంటే దానికి కారణం ఎంఐఎం చీల్చిన ఓట్లేనని తేలింది. ఇప్పుడు.. ఓవైసీ… బెంగాల్ పై గురిపెట్టారు. బెంగాల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిందేనన్న పట్టుదలతో ఉన్న బీజేపీ నెత్తిన నీళ్లు పోస్తున్నారు. ముస్లింలను మచ్చిక చేసుకునే రాజకీయాలు చేస్తున్న మమతా బెనర్జీ… ఓవైసీ బెంగాల్లోకి వచ్చి..అక్కడ పోటీ చేస్తామని ప్రకటించడంతో… అపర కాళిక అవుతున్నారు.
ఓవైసీని పరోక్షంగా తీవ్రవాదిగా మమతా బెనర్జీ వర్ణిస్తున్నారు. బీజేపీ దగ్గర డబ్బులు తీసుకుని.. బెంగాల్లో పోటీ చేయడానికి వస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముస్లిం ఓటర్లను ఓవైసీ వైపు వెళ్లకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఓవైసీ… ఇలాంటి విమర్శలను అవకాశాలుగా చేసుకుంటారు. ముస్లింల హక్కుల కోసం పోరాడితే తీవ్రవాదులు అంటారా అంటూ బెంగాల్లోకి అడుగు పెడుతున్నారు. బెంగాల్లోని ముస్లింలు గడ్డు పేదరికంలో మగ్గుతున్నారని… వారి జీవన ప్రమాణాల్లో ఎలాంటి మార్పులు రావడం లేదని అంటున్నారు. ఓవైసీ కుటుంబం దశాబ్దాలుగా… హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా రాజకీయాలు చేస్తుంది. మొత్తం వారి గుప్పిట్లోనే ఉటుంది. అక్కడ పరిస్థితులు ఏ మాత్రం మెరుగుపడ్డాయో… ఓవైసీ ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ బెంగాల్లో ముస్లింల గురించి మాత్రం ఆలోచించడం ప్రారంభించారు.
ఎమ్ఐఎమ్ బెంగాల్ చీఫ్ కొద్ది రోజుల నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఏకంగా మమత రంగంలోకి దిగారు. ఇక్కడ ఓవైసీ పార్టీ ముస్లిం ఓట్బ్యాంక్ను చీల్చితే.. అది తృణమూల్ నష్టమే..! అందుకే ముందు జాగ్రత్తగా ఎమ్ఐఎమ్పై ఎదురుదాడికి దిగుతున్నారు. ఎమ్ఐఎమ్ ఓట్లను చీల్చితే బీజేపీ కి లాభం చేకూరుతుంది. అందుకే.. ఓవైసీపై తనదైన శైలిలో మమతా బెనర్జీ విరుచుకుపడుతున్నారు.