అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలకమైన ఫైల్స్ దగ్ధంపై మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసు పెద్దిరెడ్డి కంట్రోల్ లోనే ఉందని, ఆయన అక్రమ దందా బయటపడుతుందనే ఇదంతా జరిగి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
భారీగా ల్యాండ్ కన్వర్షన్లు, భూదందాలు జరిగినట్లు తమ దృష్టిలో ఉందని… 9వందలకు పైగా ఎకరాలకు సంబంధించి భూ లావాదేవీలకు సంబంధించి ఆరోపణలు ఉన్నట్లు మంత్రి అనగాని తెలిపారు. ఆదివారం నాడు ఉద్యోగులు వచ్చి పనిచేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
Also Read : అగ్ని ప్రమాదంపై చంద్రబాబు సీరియస్… కుట్రకోణంపై విచారణ!
ఆర్డీవో నుండి కిందిస్థాయి ఉద్యోగుల వరకు అందరి ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. పెద్దిరెడ్డి అవినీతి ఇప్పటికే బయటకు వచ్చిందని, అది బయట పడకుండా ఉండేందుకు షార్ట్ సర్క్యూట్ అని నాటకమాడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
ఇప్పటికే ప్రభుత్వం విచారణ ప్రారంభించిందని, 95శాతం భూ లావాదేవీలు రిట్రివ్ చేసినట్లు తెలిపారు. ఇందులో ఎంతటి వారున్న వదిలేదని స్పష్టం చేశారు.