ఓ మంత్రి రైతుల్ని.. లం.. కొడుకులు అని తిట్టేస్తారు..!. వారు టీ షర్టులేసుకుంటారు కాబట్టి వారు రైతులు కాదని సర్టిఫికెట్ ఇస్తారు. వారు భుజంపై కండువాలు వేసుకుంటారు కాబట్టి.. వారేం రైతులు అని దబాయిస్తారు. మరో మంత్రి… విమానంలో ఢిల్లీకి వెళ్లేవాళ్లు రైతులు ఎలా అవుతారు.. పెయిడ్ ఆర్టిస్టులవుతారని తీర్మానిస్తారు…!. మంత్రులే ఇలా అంటే… ఇక ఇతర నేతల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అమరావతి రైతులపై ఇలా ఎందుకు నోరు పారేసుకుంటున్నారు.. అదీ కూడా.. కొంత మంది ఎంపిక చేసిన మంత్రులే ఇలా ఎందుకు మట్లాడుతున్నారన్నది చాలా మందికి చాలా మందికి అర్థం కాని విషయం.
ఉత్తరాంద్రకు చెందిన ఇద్దరు మంత్రులు ఒకరు ధర్మాన కృష్ణదాస్.. మరొకరు కొత్తగా మంత్రి పదవి పొందిన అప్పలనాయుడు.. రెండు మూడు రోజుల గ్యాప్‌తో అమరావతి రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విధానం ప్రకారం.. అమరావతి రైతుల ఉద్యమాన్ని వ్యతిరేకించవచ్చు. కానీ వారికి కూడా.. వీరు మంత్రులే…వారు కూడా.. ఈ రాష్ట్ర పౌరులే. వారు కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే భూములు ఇచ్చారు. వారి హక్కుల కోసం వారు పోరాడుతున్నారు. ఈ విషయాన్ని మంత్రులు పట్టించుకోవడం లేదు. రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి.. పదవులు అనుభవిస్తూ.. రైతుల్ని దారుణంగా తిట్టడం అంటే.. చిన్న విషయం కాదు.
అమరావతి రైతులపై బడుగు, బలహీనవర్గాల వారితో మాత్రమే తిట్టిస్తున్నారు. ఎప్పుడు ఎవరిపై ఎలా తిట్లు లంకించుకోవాలో.. కొంత మందికి ప్రత్యేకంగా వైసీపీ ఆఫీసు నుంచి సమాచారం వస్తుంది. ఆ మేరకు వారు.. తమ గురించి ప్రజల్లో చెడుగా చెప్పుకుంటారని కూడా అనుకోకుండా.. బూతులు తిడుతున్నారు. అవి మామూలు మాటలు కావు. వైన్స్ షాపుల దగ్గర తాగుబోతులు మాట్లాడుకునే లాంగ్వేజ్‌లో ఉంటున్నాయి. ఇంత దారుణంగా అమరావతి రైతుల్ని తిట్టి.. ఆ మంత్రులు ఏం సాధిస్తారనేది… అంచనా వేయలేని విషయం. మహా అయితే.. తమ హైకమాండ్ చెప్పినట్లుగా చేశామన్న సంతృప్తితో.. వారి విశ్వాసాన్ని మరింతగా పొందుతారేమో కానీ.. ప్రజలకు మాత్రం అన్యాయం చేసినట్లే అవుతుంది.
టీ షర్టులు వేసుకునేవాళ్లు రైతులు కారని ఎక్కడా లేదు. కండువారు వేసుకునే వాళ్లు కూడా రైతులు కారంటే… అంత కంటే అమాయకత్వం ఉండదు. ఇక విమానంలో ఢిల్లీ వెళ్లే వారు కూడా రైతులు కాదంటే.. బహుశా… వైసీపీ నేతలు… మంత్రుల ఉద్దేశాల్లో.. రైతులంటే… ఎప్పుడూ అప్పుల్లో మునిగి తేలుతూ.. తినడానికి తిండి లేకుండా ఉండేవారే అయి ఉండాలేమో..? .వైసీపీ నేతలు అనేక మంది రైతు బిడ్డలే. స్వయంగా ధర్మాన.. అప్పల్నాయుడు వంటి వారు కాకపోయినా.. వారి తండ్రులు కాకపోయినా.. వారి పూర్వికులు అయినా వ్యవసాయం చేసుకునే తరాన్ని కాపాడుకుని ఉంటారు. భూమిని నమ్ముకుని ఉండి ఉంటారు. అలాంటి వారు రైతుల్ని అంతగా తూలనాడి … మూలాల్ని శంకించుకునేలా చేస్తున్నారు కానీ.. తమ పదవికి న్యాయం చేయడం లేదు.