కడప రెడ్లు తమ భూములు కబ్జా చేస్తున్నారని.. ఊరుకోబోమని మంత్రి ధర్మాన ప్రసాదరావు .. సిక్కోలులో జరిగిన కళింగ కోమట్ల సమావేశంలో ఆవేసశంగా ప్రసంగించారు. ‘కడప నుంచి ఎవడో సుబ్బారెడ్డి వచ్చి భూమి మా జిల్లాలోని భూములను దొబ్బేస్తామన్నాడు. నువ్వు ఎవడివి.. శ్రీకాకుళం నీ అబ్బసొమ్ముకాదు.. వచ్చిన వాడు ఏ పార్టీ అనేది చూడను. ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తానంటే నడవదు. వాటిని ఎట్టి పరిస్థితిలో అంగీకరించబోను. శ్రీకాకుళంలోని సహజ వనరులు కొట్టేసేందుకే ఎక్కడెక్కడి వాళ్లో వస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే.. ఇదంతా రౌడీల చేతిలోకి వెళిపోతుంది. మిగతా ప్రాంతాలు ఇలానే పాడైపోయాయి.శ్రీకాకుళం ప్రశాంతమైన ప్రాంతం. దీన్ని ఇలాగే ఉంచుతాం’అని పరోక్షంగా సుబ్బారెడ్డి మీద మండిపడ్డారు.
ధర్మాన వ్యాఖ్యలపై విస్తృత చర్చ జరుగుతోంది. నిజానికి వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కడప అడ్డ పంచెలతో దంతాలు చేసే వారి సంఖ్య శ్రీకాకుళంలో చాలా ఎక్కువగా ఉంది. ఇసుక మొత్తం వారి కనుసన్నల్లోనే ఉంది. మూలాపేట పోర్టు దగ్గర పనుల్లో వారి దందానే కొనసాగుతోంది. కబ్జాలకూ కొదవలేదు. ముఖ్యంగా వ్యాపారాలు ఎక్కువగా చేసే కళింగ కోమట్లకు చెందిన ఆస్తలకు రక్షణ లేకుండా పోయింది. వారి ఆస్తులు లాక్కుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నికలు వస్తున్న సమయంలో ధర్మాన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నో సార్లు కడప రెడ్ల దందాల గురించి చెప్పినా పట్టించుకోని ధర్మాన ఇప్పుడు ఏదో తాను అడ్డం వస్తానన్నట్లుగా ప్రసంగించడం ఆసక్తికరంగ మారింది.
నిజానికి నిజానికి ధర్మాన తన కుమారుడికి టికెట్ కోరాడని ప్రచారం జరుగుతోంది. సీఎం సైతం ధర్మాన కుమారుడికి బదులు ఈసారికి ధర్మాన ప్రసాదరావునే పోటీచేయాలని కోరినట్లు సమాచారం. అయితే.. కొన్ని చోట్ల వారసులకు అవకాశం ఇచ్చిన సీఎం.. సీనియర్నైన తన కోరికను మన్నించకపోవటంతో ధర్మాన అసంతృప్తికిలోనైనట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే కడప రెడ్లపై వ్యాఖ్యలు చేశారు కానీ నిజంగా కళింగ కోమట్లను.. కడప రౌడీల నుంచి కాపాడాలని కాదని..మరోసారి వైసీపీ వస్తే.. వారితో చేతులు కలిపి ధర్మాన పంచుకుంటారన్న విమర్శలు వస్తున్నాయి.