ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మునిసిపల్ పట్టనాభివృద్ధి మంత్రి పి. నారాయణ, రాష్ట్ర మానవవారుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు త్వరలో వియ్యంకులు కాబోతున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు రెండవ కుమారుడు గంటా రవితేజ, మంత్రి నారాయణ రెండవ కుమార్తె శరణిని వివాహం చేసుకోబోతున్నారు. వారి వివాహం ఈనెల 30న నెల్లూరులో అంగరంగ వైభవంగా జరుగబోతోంది. వచ్చే నెల 4వ తేదీన విశాఖలో రిసెప్షన్ ఏర్పాటు చేస్తారు.