దమ్ముంటే ఒక్క లోక్‌సభ సీటు గెల్చుకుని చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. రేవంత్ గా కు దమ్ముంటే సిఏం కు రాజీనామా చేయండి… మల్కాజ్ గిరిలో పోటీ చేద్దామని సవాల్ చేశారు. అదే అయన సిట్టింగ్ సీటే కదా దమ్ముంటే పోటీకి రావాలన్నారు. నేను సిరిసిల్లాలో ఏంల్యేలకు పదవి రాజీనామా చేస్తా .. రేవంత్ సిఎం పదవికి రాజీనామా పోటీకి రావాలన్నారు.
చేవెళ్ల సభలో రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై కేటీఆర్ ఘాటుగా విరుచుకుపడ్డారు. కొడంగల్ లో ఒడిపోయినప్పుడు మగాడివి కాదా అని మండిపడ్డారు. మగాడివి అయితే.. రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేయి.. అడబిడ్డలకు 2500 ఇవ్వు… ఇచ్చిన 420 హమీలు అమలు చేయాలన్నారు. తనను పదే పదే మేనేజ్మెంట్ కోటా లీడర్ అని అనడంపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తనది మేనేజ్ మెంట్ కోటా అయితే… రాహుల్, ప్రియంకాలది ఏం కోటా అని ప్రశ్నించారు. రేవంత్ ది పేమెంట్ కోటా అని ఎద్దేవా చేశారు. మాణిక్యం ఠాగూర్‌కు డబ్బులిచ్చి పదవులుతెచ్చుకున్న పేమెంట్ కోటా అన్నారు. పేమెంట్ కోటాలో సీటు తెచ్చుకున్నందుకే రేవంత్… డీల్లీకి పేమెంట్ చేయాలన్నారు.
చేవెళ్లసభలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ , కేటీఆర్ పై ఘాటుగా విరుచుకుపడ్డారు. ఒక్క సీటులో అయినా గెలవాలని సవాల్ చేశారు. రేవంత్ చేసిన సవాల్‌తో పాటు.. చేసిన విమర్శలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో కేటీఆర్ అంతే ఘాటుగా స్పందించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో పోటీకి సిద్ధమవుతారా లేదా అని.. బీఆర్ఎస్ నేతలు ఎదురదుదాడికి దిగే అవకాశం ఉంది. అయితే కేటీఆర్ సీఎం సీటుకు రాజీనామా చేసి రావాలని షరతులు పెట్టడంపై కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు.