మంగళగిరి అభివృద్ది విషయంలో మంత్రి నారా లోకేష్ పట్టుదలగా కనిపిస్తున్నారు. తనదైన మార్క్ వేయాలని చూస్తున్నారు. మంగళగిరిలో తనను ఓడించేందుకు వైసీపీ అనేక ప్రలోభాలు చేసినా ఓటర్లు మాత్రం లోకేష్ కే పట్టం కట్టడంతో..ప్రజల నమ్మకానికి బహుమానంగా ప్రజలు మెచ్చేలా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
మంగళగిరిలోని భద్రావతి సమేత భావనా రుషి ఆలయ కళ్యాణ మండపాన్ని లోకేష్ ప్రారంభించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ..మంగళగిరిని దక్షిణ భారతదేశ గోల్డ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. పట్టణంలో అత్యధికంగా ఉన్న చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. వైసీపీ హయాంలో చేనేతలకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేకపోవడంతో మంగళగిరిలో ఎంతోమంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్న దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వాటికీ తావు లేకుండా మంగళగిరిని అభివృద్ధిలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Also Read : ఎన్నికలకు ముందే ఎమ్మెల్సీ రిజల్ట్ వచ్చేస్తోంది!
నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేందుకు 25 ఎకరాల స్థలం కేటాయిస్తామన్నారు లోకేష్. యువతలో స్కిల్స్ పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ , సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఎక్స్ ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలకు వెంటనే రియాక్ట్ అవుతూ భరోసా కల్పిస్తున్నారు. మంగళగిరిలో లోకేష్ గెలుపు అంత అవసరమో, గతంలో ఆయన ఓటమి వలన ప్రజలు ఏం కోల్పోవాల్సి వచ్చిందో తన పనితీరుతోనే లోకేష్ చాటి చెబుతున్నారు.