ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేష్ అమెరికా చేరుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఆయనకు తెలుగు సంఘాలు ఘన స్వాగతం పలికాయి. జార్జియా ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో లోకేష్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత పలు మల్టినేషనల్ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశం అవుతారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఒరాకిల్ తో పాటు పలు కంపెనీల సీఈవోలతో చర్చలు జరిపే అవకాశం ఉంది.
అమెరికాలో నారా లోకేష్ వారం రోజుల పాటు పర్యటిస్తారు.. పత్ర సినర్జీస్, బోసన్, స్పాన్ఐఓ, క్లారిటీ, ఎడోబ్, స్కేలర్, జనరల్ అటమిక్స్ సంస్థల ప్రతినిధులు, భారత కాన్సుల్ జనరల్‌తో 26న భేటీ అవుతారు. ఆస్టిన్లోని పలు కంపెనీల ప్రతినిధులతో 27న, రెడ్‌మండ్‌లో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో 28న భేటీ కానున్నారు. 29న అమెజాన్ సహా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం ఉంటుంది. లాస్ వేగాస్‌లో ఐటీ సర్వ్ అలయెన్స్ సంస్థ నిర్వహించే వార్షిక సమావేశానికి లోకేశ్ విశిష్ట అతిథిగా హాజరవుతారు. ఈ నెల 30న వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. 31న జార్జియాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. న్యూయార్క్‌లో పెట్టుబడిదారులతో నవంబరు 1న సమావేశమవుతారు.
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి అధికారిక పర్యటనకు నారా లోకేష్ అమెరికా వచ్చారు. ఎన్నారై టీడీపీ విభాగంతోనూ ఆయన సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి.. లోకేష్ పర్యటనను కోఆర్డేనేట్ చేస్తున్నది ఎన్నారై టీడీపీ నేతలే. వివిధ కంపెనీల్లో ఉన్న తెలుగువారు పెట్టుబడు కోసం తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు.