తమ సహనాన్ని చేతకాని తనంగా భావించవద్దని వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
కర్నూల్ జిల్లా హోసూరులో టీడీపీ నేత, మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసీపీ మూకలు దారుణంగా హత్య చేశాయని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ తరహా రాజకీయాలు మానుకోవాలని వైసీపీకి హితవు పలికారు.
మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరఫున క్రియాశీలకంగా శ్రీనివాసులు పని చేశాడని కారణంతో అతన్ని హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్. ప్రజలు ఓడించినా ఇంకా పాత పద్ధతిలోనే రాజకీయాలు చేస్తోన్న జగన్ అండ్ కో పద్ధతి మార్చుకోవాలన్నారు.
హత్యా రాజకీయాలు చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయన్న లోకేష్..టీడీపీ సహనాన్ని పరీక్షించవద్దని ఎక్స్ వేదికగా వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు.