టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయ్యింది. అదేంటీ మంత్రి వాట్సాప్ బ్లాక్ అవ్వడం ఏంటీ అనుకుంటున్నారా…? ఇది హ్యాకర్స్ చేసిన పనో, మరొకటో కాదు… వాట్సాప్ మాతృసంస్థ మెటా అధికారికంగా బ్లాక్ చేసింది.
నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తమకు సహయం కావాలన్నా, ప్రభుత్వం నుండి జరగాల్సిన పని పెండింగ్ లో ఉన్నా వాట్సాప్ ద్వారా మంత్రికి సమాచారం ఇస్తున్నారు. రూల్ ప్రకారం చేయాల్సిన పని అయితే వెంటనే లోకేష్ పూర్తి చేస్తున్నారు. దీంతో వాట్సాప్ కు మెసెజ్ ల తాకిడి ఎక్కువైంది. పైగా మంగళగిరి నియోజకవర్గంలోని సమస్యలు కూడా స్థానిక యువత, నాయకులు వాట్సాప్ లోనే ఆయనకు సమాచారం ఇస్తున్నారు.
మెసెజ్ లు ఎక్కువ కావటంతో మెటా సంస్థ ఆటోమెటిక్ గా అనుమానాస్పద అకౌంట్ గా బ్లాక్ చేస్తుంది. స్పామ్ అకౌంట్ గా పరిగణిస్తుంది. దీంతో… ఈ సమస్యను పరిష్కరించేందుకు గాను తన మెయిల్ కు సమాచారం ఇచ్చిన తాను రెస్పాండ్ అవుతానని లోకేష్ పిలుపునిచ్చారు.
మెటా సంస్థతో మాట్లాడి లోకేష్ వాట్సాప్ ను అన్ బ్లాక్ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.