అధికారం రాగానే పార్టీ ఆఫీసుకు దూరంగా ఉండటం, మంత్రులంతా అధికారిక కార్యక్రమాలతో పార్టీ ఆఫీసుకు రాకపోవటం, ప్రజా సమస్యల కోసం పార్టీ ఆఫీసుకు వచ్చే వారిని కలిసేందుకు ఎవరూ అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదులతో పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎల్పీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు పీసీసీ చీఫ్ మంత్రులకు షెడ్యూల్ రిలీజ్ చేశారు.
అక్టోబర్ నుండి మంత్రులు గాంధీభవన్ లో ఉండేలా డేట్స్ రిలీజ్ చేశారు.
సెప్టెంబర్ 25వ తేదీ- దామోదర రాజనర్సింహ, వైద్యారోగ్య శాఖ మంత్రి
సెప్టెంబర్ 27వ తేదీ- శ్రీధర్ బాబు, ఐటీ- పరిశ్రమల శాఖ మంత్రి
అక్టోబర్ 4వ తేదీ- ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి
అక్టోబర్ 9వ తేదీ- పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి
అక్టోబర్ 11వ తేదీ- సీతక్క, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి
అక్టోబర్ 16- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రోడ్లు-భవనాల శాఖ మంత్రి
అక్టోబర్ 18- కొండా సురేఖ, దేవాదాయ శాఖ మంత్రి
అక్టోబర్ 23- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి
అక్టోబర్ 25- జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ శాఖ మంత్రి
అక్టోబర్ 30- తుమ్మల నాగేశ్వర రావు, వ్యవసాయశాఖ మంత్రి
ప్రతి నెలలో కనీసం ఒక రోజైన సీఎం కూడా గాంధీ భవన్ కు రావాలని పీసీసీ కోరింది.