టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ బోణి కొట్టింది. 49 కేజీల మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజతం సాధించింది. మీరాబాయి ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌కు చెందిన వారు. స్నాచ్ విభాగంలో 87 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 117కేజీల బరువును ఎత్తారు. టోటల్‌గా 202 బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. దీంతో వెయిట్‌లిఫ్టింగ్‌లో కరణం మల్లీశ్వరి తర్వాత పతకం సాధించిన క్రీడాకారిణిగా మీరాబాయి రికార్డు సృష్టించింది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగి .. బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేయడంతో ఫలితం దక్కింది.
2000లో సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి కాంస్య పతకం సాధించారు. ఆ ఒలింపిక్స్‌లో ఇండియాకు లభించిన పతకం అదొక్కటే. ఆ తర్వాత షూటింగ్ విభాగాల్లో ఎక్కువ పతకాలు లభించాయి. బాక్సింగ్, రెజ్లింగ్‌లోనూ కొన్ని పతకాలు లభించాయి. 2008లో బీజింగ్‌లో జరిగిన క్రీడల్లో… అభినవ్ భింద్రా షూటింగ్లో స్వర్ణపతకం సాధించారు. గత ఐదు ఒలింపిక్స్‌లలో భారత్‌కు లభించిన స్వర్ణ పతకం అదొక్కటే. ఇంత వరకూ మళ్లీ లభించలేదు. ఇప్పుడు మీరాబాయి.. స్వర్ణ పతకాన్ని కొద్దిలో మిస్సయ్యారు.
భారత్ తరపున వెళ్లిన వాళ్లలో ఈ సారి పెద్ద ఎత్తున ప్రతిభావంతులు ఉన్నారు. పతకాలు సాధించగలిగే సామర్థ్యం ఉన్న వాళ్లు ఉన్నారని భావిస్తున్నారు. ఒలింపిక్స్ ప్రారంభలోనే ఇండియాకు రజతం దక్కడం శుభారంభంగా భావిస్తున్నారు. గత రికార్డులను బద్దలు కొట్టి.. మరిన్ని పతకాలను భారత ఆటగాళ్లు తీసుకొస్తారని అంచనా వేస్తున్నారు.