ఈ వేసవి అనుకొన్నంత సజావుగా సాగే అవకాశాలు కనిపించడం లేదు. చాలా సినిమాలు వాయిదా పర్వంలో పడిపోతున్నాయి. అందులో ఇప్పుడు ‘మిరాయ్’ కూడా చేరింది. ‘హను-మాన్’ తరవాత తేజా సజ్జా చేసిన సినిమా ఇది. కాబట్టి అంచనాలు బాగానే ఉన్నాయి. దానికి తోడు మంచు మనోజ్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీగా ఖర్చు పెట్టి ఈ సినిమా తీసింది. గతేడాదే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఏప్రిల్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. అయితే… ఈ సినిమా వాయిదా పడబోతోంది. ఏప్రిల్ 18 నాటికి ఈ సినిమా పూర్తయ్యే ఛాన్స్ లేదు. జులైలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. జులై 4న ఈ సినిమాని విడుదల చేస్తే బాగుంటుందన్నది చిత్రబృందం ఆలోచన. త్వరలోనే రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇటీవల ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ రూపొందించారు. అండర్ వాటర్‌లో షూట్ చేసిన ఈ ఎపిసోడ్ ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. మరో 20 రోజుల షూటింగ్ బాకీ ఉందని తెలుస్తోంది. ఆ తరవాత ప్రమోషన్లు మొదలెట్టాలి. ‘హనుమాన్తో’ వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్‌ని ఈ సినిమా కోసం వాడుకోవాలని చిత్రబృందం భావిస్తోంది. అందుకే ప్రమోషన్లు గట్టిగా ప్లాన్ చేయాలని చూస్తున్నారు. సినిమా కాస్త లేట్ అయినా, ప్రోపర్గా విడుదల చేయాలని పీపుల్ మీడియా భావిస్తోంది. కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.