ప్రభుత్వాలు బడ్జెట్ను ప్రవేశ పెడుతూంటాయి.అసెంబ్లీ ఆమోదం తీసుకుంటాయి. అంటే దాని ప్రకారమే ఖర్చు పెట్టాలని అర్థం . కానీ ఏపీ ప్రభుత్వం బడ్జెట్ను ఎందుకు ప్రవేశ పెడుతుందో వారికే తెలియదు. ఎందుకంటే ఆ బడ్జెట్ను అసలు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇష్టారీతిన ఖర్చు పెట్టేస్తున్నారు. బడ్జెట్ కేటాయింపుల్లేకుండా ఈ ఆర్థిక సంవత్సంలో రూ. 94 వేల కోట్లను ఖర్చు చేసింది. ఈ విషయాన్ని అకౌంటెట్ జనరల్ స్పష్టంగా చెప్పారు. కేటాయింపులే లేనప్పుడు ఇక అనుమతులు లేనట్లే. అంటే బడ్జెట్ నిబంధనలను ఉల్లంఘించి ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేశారని అర్థం.
ఏపీ ప్రభుత్వ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అకౌంటెంట్ జనరల్ లేఖ పంపారు. నిబంధనల ప్రకారం ఒక్క రూపాయి ఖర్చు చేయాలన్నా బడ్జెట్లో ప్రతిపాదించి శాసనసభ ఆమోదం పొందాల్సిఉంటుంది. దానికి భిన్నంగా రూ. 94వేల కోట్లు ఖర్చు చేయడం పట్ల ఎజి కార్యాయలయం విస్తుపోయింది. సంక్షేమానికి భారీగానే నిధులను బడ్జెట్లో ఆమోదించింది. అంటే కేటాయింపుల్లేని ఏవనేది ఇప్పుడు తేలాల్సిన అంశం. 38 శాఖల ద్వారా 17 వేల కోట్ల వరకు వ్యయం చేసేరదుకు ఆమోదం పొరదగా, ఏకంగా 30 వేల కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు తేలింది. అరటే అనుమతిరచిన మొత్తం కన్నా 13వేల కోట్లకుపైగా ఖర్చు చేశారు.
ఏపీ ప్రభుత్వం నిజానికి ఈ మొత్తం ఖర్చు చేసిందా లేకపోతే గతంలో సత్యం కంపెనీల్లోలా గోల్ మాల్ చేసి లెక్కల గూడుపుఠాణి చేసిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవతున్నాయి. ఏపీ ప్రభుత్వ అదృష్టం ఏమిటంటే వ్యవస్థలు లోపాలు.. తప్పులు చెబుతున్నాయి కానీ దిద్దుబాటుకు మాత్రం ఎలాంటి ఒత్తిడి చేయడం లేదు. పైగా సహకరిస్తుతున్నాయి. ఈ కారణంగా ఏపీ ప్రభుత్వానికి ఎక్కడా లేనంత రిలీఫ్ లభిస్తోంది. అయితే ఇది ఊహించనంత పెద్ద మొత్తం అవకతవకలు కావడంతో ఏజీ, కాగ్ వంటి వ్యవస్థలు ఇప్పుడేం చేస్తాయో చూడాల్సి ఉంది.