తెలుగు రాష్ట్రంలో తెలుగుకు కులం ఆపాదించి.. దానిపైనా కక్ష పెంచుకుని ఉనికి లేకుండా చేయాలనుకుంటున్న సీఎం జగన్ రెడ్డి గారి ఆలోచనను ఆయన వందిమాగధులు తూ.చ తప్పకుండా అమలు చేస్తున్నారు. దానికి సాక్ష్యమే ఈ మీడియా ప్రకటన. ప్రభుత్వం గిడుగు రామ్మూర్తి జయంతి సందర్బంగా తెలుగు భాషా వారోత్సాలను నిర్వహించాలనుకుంది. దీనికి అధికార భాషా సంఘం ద్వారా ఆహ్వానాలు పంపారు. స్వయంగా అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయ్ బాబు గారు సంతకం పెట్టి మరీ ఆహ్వాన ప్రకటన పంపారు., ఆ ఆహ్వాన ప్రకటన చూసి .. గిడుగు రామ్మూర్తిని ఇంత అవమానించాలా అని ప్రతి ఒక్కరూ బాధపడి ఉంటారు.
గట్టిగా యాభై పదాలు ఉండే ప్రకటనలో పది తప్పులు ఉన్నాయి. అక్షర దోషాలే కాదు.. అన్వయ దోషాలూ ఉన్నాయి. ఓ మాదిరి తెలుగు చదువుకున్న వారూ తెలుగుకి ఇంత తెగులు పట్టిందా అని ఆశ్చర్యపోతారు. ఇంకా విశేషం ఏమిటంటే..ఈ ప్రకటనపై స్వయంగా అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు సంతకం పెట్టారు. ఆయన చదవకుండా సంతకం పెట్టరు కదా.. చదివే ఉంటారు. అయినా తప్పులు దిద్దాలని ఎందుకు అనుకోలేదో …లేకపోతే ఆయనకూ తెలియదా అన్నది క్వశ్చన్ మార్కే.
ఈ విజయబాబు మామూలు పండితుడు కాదు. చాలా కాలం జర్నలిస్టుగా పని చేశారు. తర్వాత తన సామాజికవర్గాన్ని వాడుకుని ఓ పార్టీ పంచన చేరారు. అక్కడ ఉంటే ఉపయోగం ఏమీ లేదని అధికార పార్టీ పంచన చేరి… టీవీ డిబేట్లలో మేధావిలాగా…. అధికార పార్టీకి వంత పాడుతూ ఉంటారు. సరే పొట్టకూటి తిప్పలు అనుకున్నా… కనీసం తనకు ఇచ్చిన పదవిలో ఉన్నందుకు… తెలుగుకు అయినా కాస్తం గౌరవం కాపాడాలి కదా అనే ఆలోచన మాత్రం చేయడం లేదు. ఆయన పేరుతో విడుదలైన ప్రెస్ నోట్లో… లెటర్ ప్యాడ్ మీద.. ఆయన తనకు తాను పెట్టుకున్న విద్యార్హతలు మూడు లైన్లు వచ్చాయి. ఆ కింద క్యాబినెట్ హోదా అని పెద్ద అక్షరాలతో ముద్రించుకున్నారు.
ఇంత చేసి ఓ చిన్న ప్రెస్ నోట్ ను తప్పుల్లేకుండా విడుదల చే.యలేకపోయారు. మరి ఆయన పదవికి న్యాయం చేస్తున్నట్లేనా ? లేక జగన్ రెడ్డి ఇచ్చి న టాస్క్ తెలుగును చంపేయడం కాబట్టి… ఆ విధంగా న్యాయం చేస్తున్నారా ?