లార్జర్ దెన్ లైఫ్ హిట్లు కెరీర్ బిగినింగ్ లో రావడం కూడా రిస్కే. అలావస్తే మళ్ళీ ఆ స్థాయి హిట్ అందుకోవడం అంత తేలిక కాదు. ఎందుకంటే అద్భుతాలు అన్నిసార్లు సాధ్యం కావు. రాజమౌళి తన తొలి సినిమానే ‘బాహుబలి’గా తీసుకుంటే.. ఆయన మిగతా సినిమాలన్నీ బిలో యావరేజ్, యావరేజులుగా మిగిలిపోయేవి.
బొమ్మరిల్లు తర్వాత సిద్దార్ద్ చేసిన సినిమాలన్నీ ఫ్లాపులు. దీనికి కారణం బొమ్మరిల్లు ఓ క్లాసిక్. ప్రేక్షకులకు సిద్దార్ద్ పై ఓ ఇమేజ్ ఫిక్స్ అయిపొయింది. ఆయన నుండి వచ్చిన సినిమాలన్నీ అదే స్థాయిలో వుండాలని కోరుకున్నారు జనాలు. కానీ ఆ మార్క్ ని అందుకోలేక మొత్తానికి వెనకబడిపోయాడు సిద్దు.
మొన్న బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఒక ట్వీట్ చేశాడు. తను తీసిన ‘గ్యాంగ్స్ అఫ్ వాసేపూర్” ని పోస్ట్ చేస్తూ.. ‘నా జీవితంని నాశనం చేసిన సినిమా ఇది. ఈ సినిమా తర్వాత ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో ప్రతీసారి ఫెయిల్ అవుతున్నా. ఈ సినిమా అంత తొందరగా తీయాల్సిసింది కాదు” అని రాసుకొచ్చాడు. నిజమే.. కొన్ని హిట్లు అంత తొందరగా రావడం కూడా మంచింది కాదు.
విజయ్ దేవరకొండకి ‘అర్జున్ రెడ్డి’ కూడా అలాంటిదే అని చెప్పుకొవాలి. అర్జున్ రెడ్డి సినిమా జనాలకు మామూలుగా ఎక్కలేదు. అర్జున్ రెడ్డిని ఒక ట్రెండ్ సెట్టరని అభివర్ణించేసింది యావత్ సినీ లోకం. ఈ సినిమా తర్వాత విజయ్ కి ఒక మార్క్ ఫిక్స్ అయిపొయింది. ఎంతలా అంటే విజయ్ చేసే ప్రతి సినిమాని అర్జున్ రెడ్డితో పోలికలు పెట్టుకున్నారు. ఇది ఇప్పుడు విజయ్ కే తల నొప్పిగా మారింది.
అర్జున్ రెడ్డి తర్వాత గీత గోవిందం ఆడింది. ప్రేక్షకుల భలే మెచ్చుకున్నారు. ఇక్కడ కూడా అర్జున్ రెడ్డి కంపెరిజన్ వచ్చింది. కానీ విజయ్ చేసిన గొప్ప పని ఏమిటంటే.. ఒక్క షాట్ లో కూడా అర్జున్ రెడ్డిలా కనిపించలేదు. సినిమా మొత్తాన్ని మరో లైన్ లో నడిపాడు.
తర్వాత నోటా ఫ్లాఫ్. దీనికో కారణం వుంది. పెళ్లి చూపులు తర్వాత అర్జున్ రెడ్డికి ముందు నోటా వచ్చివుంటే రిజల్ట్ మరోలా వుండేదేమో.. కానీ అర్జున్ రెడ్డిలో చూసిన ఎమోషన్ ని నోటాలో చూడలేకపోయారు ప్రేక్షకులు. తర్వాత టాక్సీవాలా వచ్చింది. జోనర్ ని మార్చడం వల్ల సేఫ్ అయ్యాడు విజయ్. కధ, కధనంలో వుండే కొత్తదనం కారణంగా టాక్సీవాల…విజయ్ సినిమాగా కాకుండా డిఫరెంట్ జోనర్ సినిమాగా అలరించింది.
ఇప్పుడు డియర్ కామ్రేడ్ కి మళ్ళీ నోటా సమస్య వచ్చింది. విజయ్ తెరపై ఎలా కనిపించాడు అనే పాయింట్ మీద సినిమా వెళ్ళింది. ఇక్కడ విజయ్ ని మళ్ళీ అర్జున్ రెడ్డితో పోలికలు పెట్టుకున్నారు. ఇందులో విజయ్ తప్పు కూడా వుంది. అనవసరంగా అర్జున్ రెడ్డిని బాబీ పాత్రలో ఇమిటేట్ చేశాడు. అయితే కధ వేరే డెప్త్ లో వుండటం వల్ల ఎమోషన్ అతకలేదు. దీంతో అర్జున్ రెడ్డిని ఇమిటేట్ చేస్తున్న ఫీలింగే వచ్చింది.
నిజానికి ‘డియర్ కామ్రేడ్’, గీత గోవిందంకి చాలా దగ్గర పోలికలు వున్నాయి. ఈ రెండు కధలు కూడా హీరోయిన్ చుట్టూ తిరిగేవే. గీతలో హీరోయిన్ చుట్టూ తిరిగిన గోవిందం హిట్ కొట్టాడు. అలాగే డియర్ లో కూడా బాబీ, లిల్లీ చుట్టూ తిరిగుంటే రిజల్ట్ మరోలా వుండేది. అసలు కధైన లిల్లీని వదిలేసి.. కొసరు కధ చుట్టూ తిరిగి మధ్యమధ్యలో అర్జున్ రెడ్డిని బయటికి తీస్తూ ఏదేదో చేశారు. దీంతో ఎటూ కాకుండా పోయింది ‘డియర్ కామ్రేడ్’.
ఈ సినిమాతో విజయ్ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే.. కధతో సంబంధం లేకుండా అర్జున్ రెడ్డి తెరపై తీసుకురావడానికి ట్రై చేయకూడదు. ఒకవేళ అర్జున్ రెడ్డిని మళ్ళీ తెరపై చుపించాలంటే అంత డెప్త్ వున్న కధ ఎంపిక చేసుకొని చేయాలి. అంతేకానీ మధ్యలో మధ్యలో గెస్ట్ రోల్ లా అర్జున్ రెడ్డి కనిపించకూడదు. అలా చేస్తే మాత్రం ఆడియన్స్ మూడ్ డైవర్ట్ అవుతుంది. దిని కోసం విజయ్ ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన పనిలేదు. గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలు మళ్ళీ చూస్తే చాలు. డియర్ కామ్రేడ్ సినిమాలో చేసిన తప్పులు అర్ధమైపోతాయి.