ఎంతటి పెద్ద దర్శకుడికైనా బ్యాడ్ టైం ఉంటుంది . శ్రీను వైట్ల కూడా ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ లోనే వున్నారు. ఆగడు, బ్రూస్లీ లాంటి ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత కాస్త వెనకబడ్డారు వైట్ల. ఈ రెండు దెబ్బలతో బడా హీరోలు ముఖం చాటేశారు. అయితే తనని మళ్ళీ నిరూపించుకోవడానికి ఇప్పుడు ‘మిస్టర్’ తో వస్తున్నాడు వైట్ల. వరుణ్ తేజ్- వైట్ల కలయికలో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. లావణ్య త్రిపాటి, హేబ్బా పాటిల్ హీరోయిన్స్. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ బయటికివచ్చింది. ఈ ట్రైలర్ చూస్తే ఒక్కమాట మాత్రం చెప్పొచ్చు.’హీరో- ఓ తింగరి బ్యాచ్” హాంగోవర్ నుండి వైట్ల బయటపడినట్లు కనిపిస్తుంది. విలన్స్ బకరాలు చేసి నవ్వించే కార్యక్రమం పెట్టుకోలేదనిపిస్తుంది. మొత్తంమ్మీద మిస్టర్ మారాడు అనిపిస్తుంది.
ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు ఓ లవ్ స్టొరీ అనిపించింది. వైట్ల కెరీర్ ప్రారంభంలో తీసిన సొంతం, ఆనందం సినిమాల తరహాలో ఓ చక్కటి ప్రేమకధ ఏమో అనిపిచింది. అయితే ట్రైలర్ చూసిన తర్వాత మరీ ప్యూర్ లవ్ స్టోరీ అని చెప్పలేం. ప్రేమకు హీరోయిజం మిక్స్ చేసినట్లు అనిపిస్తుంది. కధ అమెరికాలో ఓపెన్ అయి ఇండియాకి వస్తుంది. మరి ఈ రెండిటికి లింక్ ఏమిటనేది తెరపైనే చూడాలి. చిత్రీకరణ చక్కగా వుంది. గుహన్ సినిమాటోగ్రఫీ రిచ్ నెస్ తీసుకొచ్చింది. లావణ్య పద్దతిగా కనిపించారు. హెబ్బ మోడ్రన్ అమ్మాయి. వరుణ్ విషయానికి వస్తే.. కొత్త లుక్ తో చాలా సెటిల్ గా కనిపించాడు. ‘జీవితం చాలా చోట్లకు తీసుకువెళుతుంది. కాని ప్రేమ జీవితం వున్న చోటుకే తీసుకువెళుతుంది” అని చెప్పిన డైలాగ్ ఈ సినిమా ధీమ్ ను చెబుతుంది.
ఈ సినిమా శ్రీను వైట్లకి, ఇటు వరుణ్.. ఇద్దరికీ కీలకం. వరుస పరాజయలాతో రేసులో వెనకబడ్డాడు వైట్ల, ఓ కమర్షియల్ హిట్ కోసం వరుణ్ ఎంతగానో ఆశలుపెట్టుకునారు మిస్టర్ పై. మరి ఈ మిస్టర్ ఏం చేస్తాడో చూడాలి.