పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని తిరుపతిలో హౌస్ అరెస్టు చేశారు. ఆయన పుంగనూరు వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని వెళ్లవద్దని పోలీసులు స్పష్టం చేశారు. అయినా వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా గతంలో వెళ్లేందుకు ప్రయత్నించి దాడుల భయంతో ఆగిపోయారు. తమకు ప్రత్యేక భద్రత కావాలని కోర్టులో పిటిషన్లు వేసుకున్నారు.
ఇప్పుడీ తండ్రీకొడుకుల పరిస్థితి … కళ్లు నెత్తికెక్కి ప్రవర్తించే ప్రతి రాజకీయ నాయకుడికి రేపు అనేది ఉంటుందని గుర్తుంచుకోవాలన్న సంకేతాలు ఇస్తోంది. పుంగనూరును గతంలో సొంత సామ్రాజ్యంగా చేసుకుని ఇతరులు వస్తే దాడులుచేసేవారు. రాళ్లతో కొట్టించేవారు. చివరికి బోడె రామచంద్ర యాదవ్ ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఇంటిపైనా దాడిచేశారు. ఇప్పుడు వారికి వారి సామ్రాజ్యంలోనే నిరనస వ్యక్తమవుతోంది. వారు అడుగుపెట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది ప్రజాస్వామ్యం కాదని.. చెప్పుకొస్తున్నారు. వారు చేసిందాని కన్నా ఇప్పుడు టీడీపీ నేతలు తక్కువే చేస్తున్నారు.అయినా గింజుకుంటున్నారు.
ఇప్పుడు పెద్దిరెడ్డి తండ్రీ కొడుకులు పుంగనూరులో అడుగుపెట్టే పరిస్థితి లేకపోవడంతో క్యాడర్ ధైర్యంగా లేదు. ఎవరికి వారు వెళ్లిపోతున్నారు. టీడీపీలో చేరిపోతున్నారు. భయపెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటున్నారు. అయితే ధైర్యం కల్పించి పార్టీలోనే ఉంచుకోవచ్చు కదా అని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. తనదాకా వస్తే కానీ తెలియదన్నట్లుగా పెద్దిరెడ్డి తండ్రీ కొడుకులు గింజుకుంటున్నారు. ఇదేముందని ముందు ముందు ముసళ్ల పండగ ఉందని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.