దర్యాప్తు సంస్థల నిస్సహాయతపై నిందితులు జాలి చూపిస్తున్నారు. నోటీసులు ఇచ్చి ఇచ్చి అలసి పోతున్న వారికి పోన్లెండి.. క్వశ్చన్స్ పంపండి.. ఆన్సర్లు లాయర్ తో పంపిస్తానని జాలి చూపిస్తున్నారు. మాకు అంత కంటే చాలా పనులున్నాయని.. తీరిక లేదని చెబుతున్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇదే సమాధానం సీఐడీ అధికారులకు పంపారు.
శనివారం విచారణకు రావాలని మిథున్ రెడ్డికి సీఐడీ సిట్ నోటీసులు పంపింది. ఇప్పటికి చాలా సార్లు పంపింది. ఆయనకు రిలీఫ్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరిస్తే సుప్రీంకోర్టుకెళ్లారు. ఆయనపై ఇంకా అధికారికంగా కేసులు పెట్టకపోయినా ముందస్తు బెయిల్ తెచ్చేసుకున్నారు. విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు చెప్పింది. సహకరించడం అంటే సీఐడీ అధికారులు క్వశ్చన్స్ పంపిస్తే.. లాయర్ తో సమాధానాలు పంపిస్తానని జాలి చూపించడం అన్నట్లుగా మారిపోయింది.
మద్యం స్కాంలో అడ్డగోలుగా దోపిడీ చేసిన నిందితులు.. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని చెలరేగిపోతున్నారు. అన్ని ఆధారాలు ఉన్న అసలు వ్యవస్థలు మాత్రం.. ప్లీజ్ ..ప్లీజ్ విచారణ రండన్నట్లుగా నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నాయి. అసలేం జరుగుతుందో చాలా మందికి అర్థం కావడం లేదు.