హిందూపురం జిల్లా సాధన కోసం తాను.. టీడీపీ కౌన్సిలర్లు రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని.. మీరు సిద్ధమా అని వైసీపీ నేతలకు ఎమ్మెల్యే బాలకృష్ణ సవాల్ చేశారు. హిందూపురం జిల్లా సాధన కోసం మౌనదీక్ష ను బాలకృష్ణ చేపట్టారు. అంతకు ముందు హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సాధన విషయంలో మాట తప్పిన వైసీపీ నేతలపై మండిపడ్డారు. పార్లమెంట్ కేంద్రాలను జిల్లా చేస్తాను అని పాదయాత్రలో జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
అన్ని అర్హతలు ఉన్న హిందుపురాన్నే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధమన్నారు. మా కౌన్సిలర్లు.. నేను రాజీనామాకు సిద్ధం.. మీరు సిద్ధమా అని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ గతంలో 30 మంది కౌన్సిలర్లను ఇస్తే హిందూపురాన్ని జిల్లాగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.. ఇప్పుడు ఆ హామీ ఏమైంది అని ప్రశ్నించారు. పుట్టపర్తిని జిల్లాగా చేస్తే పుట్టపర్తిలో కూడా ధర్నా నిరసనలు చేపట్టి హిందూపురం జిల్లాను సాధించుకుంటామన్నారు.
యం.పి పుట్టపర్తికి మద్దతు పలికాడు… ఇప్పుడు యం.పి. ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. హిందూపురాన్నే జిల్లాగా ప్రకటిస్తూ శ్రీసత్య సాయి జిల్లాగా నామకరణం చేయాలని స్పష్టం చేశారు. హిందూపురం వైసీపీ నేతల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. అటు ప్రజాభిప్రాయాన్ని గౌరవించలేక ఇక హైకమాండ్‌ను ఎదిరించలేక తంటాలు పడుతున్నారు. ఇప్పుడు బాలకృష్ణ నేరుగా ఉద్యమంలోకి దిగడంతో పరిస్థితి సీరియస్‌గా మారింది.