వరుస చేరికలతో ఫుల్ ఫామ్ లో ఉన్న అధికార కాంగ్రెస్ కు ఊహించని విధంగా షాక్ తగిలింది. ఇటీవలే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి కారెక్కారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు.
కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి నెల రోజులు కూడా గడవలేదు.. అప్పుడే బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు.పార్టీలో ప్రాధాన్యత లేకే ఆయన కాంగ్రెస్ ను వీడారా..? లేక మరేదైనా కారణమా..?అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read : అసెంబ్లీ ఆవరణలోనే రుణమాఫీ ఎందుకు..ఇదేనా అసలు వ్యూహం?
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికను ఆదిలోనే గద్వాల కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసిన సరిత తిరుపతయ్య తీవ్ర వ్యతిరేకించారు. కానీ, రేవంత్ బుజ్జగింపులతో వారు మెత్తబడటంతో ఈ నెల 6వ తేదీన రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్సీ కూడా త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే అనూహ్యంగా గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరడం చర్చనీయంశం అవుతోంది.