సీఎం జగన్ మీట నొక్కిన రూ. పదివేల రుణం పథకానికి … బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని ఆ బ్యాంకుల ముందే చెత్త పోసిన వైపరీత్యం గుర్తుందా ?. అప్పట్లో బ్యాంకుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో చివరికి ప్రభుత్వం కింది స్థాయి మున్సిపల్ సిబ్బందిని బలి చేసి తప్పించుకుంది. కానీ ఆ ఈ సారి అలాంటి పనిని ప్రజల ఇళ్ల ముందే చేస్తామని అంటోంది. చెత్తపన్ను కట్టకపోతే అందరి చెత్తను ఇళ్ల ముందే పోస్తామని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఏ మాత్రం సిగ్గుపడకుండా ప్రజల్ని హెచ్చరించారు.
శ్రీకాకుళంలో ఆయన ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెత్త పన్ను గురించి ఆయన దృష్టికి ప్రజలు తీసుకెళ్లారు. అంతే… ఆయన ఒక్కసారిగా ప్రజలపై ఫైరయ్యారు . ప్రభుత్వ పది పథకాలతో పెద్ద ఎత్తున డబ్బులిస్తూంటే తీసుకుని రూ . వంద కట్టలేరా అని మండిడ్డారు. 100 రూపాయలు చెత్త పన్ను వసూలు చేస్తే రాద్దాంతం దేనికని ప్రశ్నించారు. రూ. వంద పన్ను వసూలులో పెద్ద విషయం ఏముందని ప్రశ్నించారు . పన్ను కట్టని వారి చెత్త తీసుకెళ్ళబోమని వారి ఇంటి ముందే పోసేస్తామని కూడా ఎమ్మెల్యే ధర్మాన హెచ్చరించారు. ఇంటి ముందు చెత్త పోసిన తర్వాత అనుభవించండి తెలుస్తుందని మండిపడ్డారు.
ఎమ్మెల్యే మాటలు విని అక్కడి ప్రజలు అవాక్కయ్యారు. పన్ను విషయంలో ప్రజల బాధలు అర్థం చేసుకుంటారేమోనని వారు అనుకున్నారు. కానీ రివర్స్‌లో ఆయన ప్రజల్నే విమర్శించడంతో ఏం చేయాలో వారికీ అర్థం కాలేదు. ఏమైనా నోరు తెరిస్తే.. కేసులు … జైళ్లు కాబట్టి… ఇక చెత్తపన్ను కట్టుకోవడమే ఉత్తమం అని డిసైడయ్యారు.