ఎమ్మెల్యేలు ఎర కేసులో సోమవారం హైకోర్టు తీర్పు రానుంది. ఈ కేసు సీబీఐకి ఇవ్వాలా వద్దా అన్నది హైకోర్టు డిసైడ్ చేయనున్నది. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాల్ని కీలక మలుపు తిప్పనుంది.ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకి ఇవ్వాలన్న సింగిల్ జడ్జ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థిస్తే.. సీబీఐ వెంటనే రంగంలోకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే సంచలనం నమోదవుతుంది. ముందుగా … ఫిర్యాదు చేసిన వారిని ప్రశ్నించవచ్చు. ఈ కేసులో చెబుతున్న రూ. వందల కోట్ల డీల్స్ కు నిధులు ఎక్కడివని.. బయటకు తీసే అవకాశం ఉంది. నిజానికి సీబీఐకి కేసు వెళ్తే ఎలాంటి మలుపులు తిరుగుతుదో అంచనా వేయడం కష్టం. కానీ ఒక్కటి మాత్రం నిజం. అది బీజేపీ నేతలవైపు కాదు.. .ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతల వైపే విచారణ గురి పెట్టి ఉంటుంది.
ఒక వేళ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును పక్కన పెడితే.. సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. అప్పుడు గతంలో ప్రారంభించిన విచారణకు కొనసాగింపు ఉంటుంది. అది ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే కీలక నేతలకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులు న్యాయవివాదాల్లో ఉన్నాయి. హైకోర్టు విచారణకు పర్మిషన్ ఇస్తే మరోసారి అన్నీ ముందుకు వస్తాయి. కేసులో ఎలాంటి తీర్పు వచ్చినా విషయం సుప్రీంకోర్టుకు వెళ్లడానికి ఎక్కువ చాన్స్ ఉంది. సీబీఐకి ఇస్తే తెలంగాణ ప్రభుత్వం.. సిట్ కు ఇస్తే… నిందితులూ అదే పని చేస్తారు. అయితే తీర్పు మాత్రం సంచలనంగా మారడం ఖాయం అని అనుకోవచ్చు.
అయితే ఈ కేసు విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు నెమ్మదిగా ఉంటున్నాయి. సీబీఐ విచారణపై హైకోర్టు ఎటువంటి స్టే ఇవ్వలేదు. కానీ సీబీఐ మాత్రం ఇంకా విచారణ ప్రారంభించలేదు. ఈ కేసుపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డిజిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లింది కనుక తీర్పు వచ్చే వరకూ చూడాలని నిర్ణయించుకున్నట్ుగా తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో కేసు నమోదు చేశారని.. ఒక్క సారి హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే విరుచుకుపడుతారని అంటున్నారు. ఏం జరిగినా సోమవారం నుంచి కీలక ఘటనలో చోటు చేసుకునే అవకాశం ఉంది. .