తెలంగాణలో టీడీపీకి ఎమ్మెల్యేలు లేరు. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలి సారిగా తెలంగాణ ప్రాంతంలో గత ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. 2019లోనూ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. తర్వాత వారు పార్టీ మరిపోయారు.. అది వేరే విషయం. కానీ ఎన్నికల్లో టీడీపీ ప్రాతినిధ్యం లేని సందర్భమే లేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆ లోటు కనిపిస్తోంది. కానీ త్వరలోనే అసెంబ్లీలో టీడీపీకి ప్రాతినిధ్యం లభించే అవకాశం కనిపిస్తోందని… విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఓ ఎమ్మెల్యే టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.
ఇప్పటికే చంద్రబాబుతో చర్చలు కూడా పూర్తయ్యాయని.. ఇతర రాజకీయ పరిణామాలతో లింక్ ఉంటుంది కాబట్టి.. వాటిని బట్టి ఆయన పార్టీలో చేరిపోతారని అంటున్నారు. ఓ ఎమ్మెల్యే మాత్రమే కాదు.. మరి కొంత మంది సీనియర్ నేతలు బ్యాక్ టు టీడీపీ అన్న పద్దతిలో ఉన్నారని అంటున్నారు. బాబూమోహన్ పసులు చొక్కా వేసుకుని టీడీపీ ఆఫీసుకు వచ్చశారు. ఆయనతో పాటు మరికొంత మంది నేతలూ చర్చల్లో ఉన్నారు.
చంద్రబాబు తెలంగాణ టీడీపీని గాడిలో పెట్టాలనుకున్నారు. ఈ సారి నియమించబోయే అధ్యక్షుడు ఆషామాషీగా ఉండరని.. పార్టీని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే వారే వస్తారని అంటున్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి నియామకం తర్వాత ఎక్కువగా తెలంగాణ టీడీపీలో చేరికలు ఉండే అవకాశాలు ఉన్నాయి.