వైసీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీలకు క్యాడర్ హాజరయ్యారు. వారందర్నీ బుజ్జగించాడనికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువగా చెప్పిన మాట ఏమిటంటే.. ” వాలంటీర్లు మనం పెట్టిన వాళ్లం. మన మాట వినకపోతే వాళ్లని తీసేద్దాం..” అంబటి రాంబాబు, తానేటి వనిత, దాడిశెట్టి రాజా వంటి మంత్రులే కాదు ఎమ్మెల్యేలందరిదీ అదే మాట. వాలంటీర్లు తమ పార్టీ వారే అంటారు కానీ మాట వినకపోతే తీసేద్దామంటారు. ఇలా చెప్పి పార్టీ నేతల్ని సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. వాలంటీర్లు తమ వ్యవస్థలో చొరబడి తమకు ప్రాధాన్యం లేకుండా చేశారని రగిలిపోతున్న వైసీపీ నేతల అసంతృప్తిని పై స్థాయి నేతలు చేస్తున్నారు.
ప్రజల్లో పలుకుబడి వైసీపీ నేతలకు కాదు వాలంటీర్లకే !
ప్రజలు ఏం కావాలన్నా వాలంటీర్ల దగ్గరకే వెళ్తున్నారు. ఎమ్మెల్యేలకు కూడా పలుకుబడి ఉండటం లేదు. ఎమ్మెల్యే కన్నా వాలంటీర్లే పవర్ ఫుల్ అని వైసీపీ ఎమ్మెల్యేలు తరచూ అంటూంటారు. ప్రభుత్వ పథకాల విషయంలో ఇది నిజం కూడా. పథకాలు ఉంచాలన్నా తీసేయాలన్న వాలంటీర్లే. కావాలన్నా వాలంటీర్లే. వారే పథకాలు ఇప్పిస్తారు. దీంతో ప్రజలు వాలంటీర్లనే నమ్ముకుంటున్నారు. ఇతర వైసీపీ నేతలను పట్టించుకోవడం లేదు. దీంతో వైసీపీ నేతలకు కనీసం ప్రజల వద్ద పలుకుబడి కూడా లేకుండా పోయింది. ఈ అసహనం వారిలో రోజు రోజుకు పెరిగిపోతోంది.
వైసీపీ నేతల కన్నా తామే ఎక్కువన్నట్లుగా వాలంటీర్ల ప్రవర్తన !
వైసీపీ నేతల మాట వినని వాలంటీర్లు సొంత వ్యవహారాలు చేసుకుంటున్నారు. ప్రజలు వైసీపీ నేతలతో మాట్లాడుకోవడం కంటే వాలంటీర్లతో మాట్లాడుకుంటే పనులవుతాయని వారి వెంట తిరుగుతుననారు . దీంతో వాలంటీర్లు తామే పవర్ ఫుల్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తామే వైసీపీ నేతలమన్నట్లుగా చెలరేగిపోతున్నారు . ఈ పరిస్థితులు… పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అసహనం కలిగిస్తున్నాయి. కష్టం తమది అయితే వాలంటీర్లు అధికారం అనుభవిస్తున్నారని వారు ఫీలవుతున్నారు. ఈ కారణంగా వైసీపీ నేతలు వాలంటీర్లతో ఈగో ప్రాబ్లమ్స్ తలెత్తుతున్నాయి. వైసీపీ నేత కన్నా వాలంటీర్కే పవర్ ఎక్కువ కావడంతో వైసీపీ నేత చిన్నబోతున్నాడు.
వాలంటీర్ వ్యవస్థ రివర్స్ అవుతోందని వైసీపీ క్యాడర్ ఆందోళన
వాలంటీర్ల వల్ల ఎంతో మేలు జరుగుతుందని వైసీపీ నేతలు అనుకున్నారు. కానీ ఇప్పుడు అది రివర్స్ అవుతోంది. పెద్ద ఎత్తున ప్రజాధనం వాలంటీర్లకు జీతాలుగా ఇస్తున్నారు. అదే సమయంలో వారి ద్వారా యాభై కుటుంబాలను కనిపెట్టుకుని ఉండే ఏర్పాటు చేశారు. కానీ వారి తీరుతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. పార్టీ నేతల్లోనూ అసంతృప్తి పెరుగుతోంది. చివరికి వాలంటీర్ల ద్వారా రెండు విధాలుగా నష్టం జరుగుతుందన్న ఆందోళన వైసీపీ నేతల్లో ప్రారంభమయింది. ఈ వ్యహం రివర్స్ అవుతోందన్న ఆందోళనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.