గడపగడపకూ వెళ్తున్నా మొత్తం నెగెటివ్ వేవ్ కనిపిస్తూండటంతో వైసీపీ పెద్దలు వ్యూహం మార్చారు. ఎమ్మెల్యేల కన్నా ఎమ్మెల్యేల పీఏలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేల పీఏలను పిలిపించి ప్రత్యేకంగా మీటింగ్ పెట్టారు. వారికి ట్రైనింగ్ క్లాసులు ఇస్తున్నారు. గడప గడపకూ వెళ్తున్నప్పుడు ఎమ్మెల్యేలకు ప్రజలు సమస్యలు వివరిస్తున్నారు. ఆ సమస్యలేమిటో తెలుసుకుని పరిష్కరించాల్సి ఉంది. పథకాలు అయితే పథకాలు.. ఇతర సమస్యలు అయితే ఇతర సమస్యలు .
కానీ పార్టీ వెళ్లమంది కదా అనిచాలా మంది వెళ్తున్నారు కానీ అత్యధిక మంది తూ తూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. దీంతో లక్ష్యం నెరవేరడం లేదు. ప్రజలు ఇచ్చిన ఆర్జీలకు పరిష్కారం లభించడం లేదు. ఎమ్మెల్యేలకు ఏ ఆర్జీ ఇచ్చినా అది పీఏ చేతికి వస్తుంది. దీంతో పీఏలకు ట్రైనింగ్ ఇచ్చి ఆ సమస్యలు పరిష్కారమయ్యేలా ఫాలోఅప్ చేయించాలని వైసీపీ హైకమాండ్ నిర్ణయించింది. విజయసాయిరెడ్డి ఈ మేరకు ప్రత్యేక తరగతులు ప్లాన్ చేసి ఈ మేరకు అందర్నీ పిలిపించారు.
యాప్ ద్వారా ఎలాంటి పరిష్కారాలు చూపాలో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. అయితే ఇరప్పటికే వాలంటీర్లు.. వార్డు సచివాలయాలను పెట్టి తమకు విలువ లేకుండా చేశారని ఎమ్మెల్యేలు ఫీలవుతున్నారు. ఇప్పుడు ఏమైనా పనులు కూడా తమ పీఏల ద్వారా పూర్తి చేయాలని నిర్ణయించుకోవడంతో ఎమ్మెల్యేలు మరింత డమ్మీ క్యాండిడేట్లుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఎమ్మెల్యేల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది.