ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. గైనిక్ సమస్యతోపాటు వైరల్ ఫీవర్ తో బాధపడుతుండటంతో కవితను జైలు సిబ్బంది ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు.
ఇదివరకు కొద్ది రోజుల కిందటే కవిత అస్వస్థతకు గురి కావడంతో ఆమెను ఎయిమ్స్ కు తరలించి వైద్య సేవలు అందించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె ఏకంగా 11 కిలోల బరువు తగ్గారని ఇటీవలే మీడియా సమావేశంలో కేటీఆర్ తెలిపారు.
ఈ క్రమంలోనే కవిత మరోసారి అస్వస్థతకు కావడం పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఇక, అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న కవితకు బెయిల్ ఇవ్వాలంటూ ఇప్పటికే ఆమె తరఫు లాయర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కవిత తరఫు న్యాయవాదుల వాదనలు ముగిసినా, ఈడీ కౌంటర్ చేయాలని ఆ తర్వాతే బెయిల్ పై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు చెప్పడంతో కవిత బెయిల్ పిటిషన్ మరోసారి వాయిదా పడింది.
ఈ నెల 27న కవిత బెయిల్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది.