వైసీపీకి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. త్వరలోనే ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరనున్నారని తెలుస్తోంది. ఈమేరకు మురుగుడు హనుమంతరావు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చేలా ఉన్నాయి.
మంగళగిరిలో జరిగిన ఓ కల్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ తో పాటు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి చంద్రబాబు వీవర్సకు జిఎస్టి లేకుండా కేంద్రంతో మాట్లాడి తీసేస్తామని హామీ ఇచ్చారన్నారు. చేనేతలకు మగ్గాలు లేని వారికి సొంత ఇల్లు నిర్మిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీకి హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : ఇండియా కూటమికి దగ్గరగా వైసీపీ… మరో అడుగు !
మురుగుడు హనుమంతరావు ఎవరో కాదు..మంగళగిరి నుంచి లోకేష్ పై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి లావణ్య మామ. నియోజకవర్గంలో గట్టి పట్టున్న నేత కావడంతో ఆయన కోడలుకు గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. అయితే లోకేష్ కు ఆమె కనీస పోటీ ఇవ్వలేకపోయారు. రికార్డ్ స్థాయి మెజార్టీతో లోకేష్ విజయం సాధించడం.. అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి లోకేష్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుండటం ప్రజలను ఆకర్షిస్తోంది.
ఇక, చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వరాల జల్లు కురిపించడం పట్ల మురుగుడు హనుమంతరావు కృతజ్ఞతలు తెలపడం ఆసక్తికర చర్చకు దారితీసింది. టీడీపీలో చేరాలనే ఆలోచనతోనే చంద్రబాబుపై హనుమంతరావు ప్రశంసల జల్లు కురిపించారని మంగళగిరిలో చర్చ మొదలైంది.