ఆంధ్రప్రదేశ్ లో దారుణమైన రోడ్లు ఎమ్మెల్సీని బలిగొన్నాయి. ప.గో జిల్లా ఉండి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన సాబ్జీ దుర్మరణం పాలయ్యారు. షేక్ సాబ్జీ ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ తరపున 2021లో విజయం సాధించారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న షేక్ సాబ్జి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం విస్తృతంగా శ్రమించారు.
ఏలూరు నుంచి భీమవారం వెళ్తుంజగా.. ఈ కారు ప్రమాదం జరిగింది. ఈ రహదారి అత్యంత ప్రమాదకరంగా మారింది. ఎన్నో సార్లు తీవ్ర విమర్శలు వచ్చినా ప్రభుత్వం కనీసం రిపేర్లు చేయించే ప్రయత్నం చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. ఉపాధ్యాయ సమస్యలపై పోరాడుతున్నందుకు ఆయనను ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఎమ్మెల్సీ కోటాలో ఆయన తిరుపతిలో తన అనుచరులతో దర్శనానికి వెళ్తే.. టిక్కెట్లు అమ్ముకున్నారని విజిలెన్స్ కేసులు పెట్టించి.. అరెస్టు చేసినంత పని చేశారు. దీన్ని మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యేలా చేసి.. ఆయనను ఇబ్బంది పెట్టారు.
ఎమ్మెల్సీ దుర్మరణంపై రాజకీయవర్గాల్లో దిగ్భ్రాంతి వ్యక్తమవతోంది. ఉపాధ్యాయ వర్గాల కోసం ఆయన రాజీ లేని పోరాటం చేశారని గుర్తు చేసుకుంటున్నారు.